Mirai: మిరాయ్ కోసం మరో కుర్ర డైరెక్టర్?
- తేజ సజ్జా హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో మిరాయ్
- ఈ సినిమాలో కీలక పాత్ర కోసం నటుడిగా మారిన దర్శకుడు వెంకటేష్ మహా
- మరోసారి శ్రీలంక వెళ్లడానికి ప్రణాళిక సిద్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తేజ సజ్జా హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో మిరాయ్ అనే సినిమా తెరకెక్కుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. 2025లో సినిమాని రిలీజ్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో కీలక పాత్ర కోసం నటుడిగా మారిన దర్శకుడు వెంకటేష్ మహాని తీసుకున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కొద్ది రోజుల క్రితం శ్రీలంకలో జరిగింది. సుమారు పది రోజుల పాటు జరిగిన ఈ షెడ్యూల్ లో వెంకటేష్ మహా కూడా పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో ఆయనదే ఒక కీలకమైన పాత్ర అని తెలుస్తోంది. ఇక శ్రీలంకలో మరో ఒక లాంగ్ షెడ్యూల్ బ్యాలెన్స్ ఉండగా సినిమా యూనిట్ మరోసారి శ్రీలంక వెళ్లడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంటుంది.
Game Changer: దీపావళికి మచ్చా దిగుతున్నాడు.. గెట్ రెడీ!
Also Read
ఇక శ్రీ లంకలో షూట్ ముగించుకొని నిన్నే తేజ సజ్జ హైదరాబాద్ కి తిరిగి వచ్చాడు. ఈ క్రమంలో ఎయిర్ పోర్ట్ లో తేజ సజ్జ కనిపించగా చేతికి కట్టుతో కనిపించింది. ఇక ఈ విజువల్స్ వైరల్ గా మారాయి. ఇక డూప్ లేకుండా రియల్ గా యాక్షన్ సీక్వెన్స్ లు చేస్తున్నందుకు తేజ సజ్జ ఫ్యాన్స్, పలువురు నెటిజన్లు అభినందిస్తున్నారు. హనుమాన్ లో కూడా తేజ సజ్జ డూప్ లేకుండా రియల్ యాక్షన్ సీన్స్ చేసి మెప్పించగా ఆ సినిమా వల్ల కూడా అతని కంటికి సమస్యలు వచ్చి చికిత్స చేయించుకున్నాడని చెప్పొచ్చు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!