Site icon NTV Telugu

సురేష్ బాబుపై వెంకటేష్ అభిమానుల ట్రోలింగ్…!

Venkatesh Fans Trolling on Suresh Babu

సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబుపై ఆయన సోదరుడు, టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ అభిమానులు ట్రోలింగ్ మొదలెట్టారు. సురేష్ బాబుపై వారు చాలా ఆగ్రహంగా ఉన్నారు. దీనికి కారణం లేకపోలేదు. తమ అభిమాన నటుడు నటించిన రెండు చిత్రాలను ఓటిటిలో విడుదల చేయబోతున్నారనే వార్తలు విన్పిస్తున్నాయి. ఆ రెండు చిత్రాలు “నారప్ప”, “దృశ్యం-2”. కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ చిత్రాలు ఇంకా విడుదల కాలేదు. ఇప్పటికే డైరెక్ట్-డిజిటల్ రిలీజ్ కోసం “దృశ్యం-2” హాట్‌స్టార్‌కు అమ్ముడైంది. అయితే ఈ సినిమా గురించి పెద్దగా పట్టించుకోని వెంకీ అభిమానులు మరో సినిమా విషయంలోనే కోపంగా ఉన్నారు.

Read Also : ‘ఆర్ఆర్ఆర్’ ఫోటోతో… ‘మీమ్స్’ వీరుల హంగామా! ఎక్కడ చూసినా ఎన్టీఆర్, చరణ్ బైకే…

అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ “నారప్ప”ను ఓటిటి ప్లాట్‌ఫామ్‌లో నేరుగా విడుదల చేయాలన్న సురేష్ బాబు ప్రణాళికఫై వారు ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. వెంకటేష్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ భారీ చిత్రం థియేటర్లలో మాత్రమే విడుదల కావాలనేది వారి వాదన. అందుకే వారంతా సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు దిగారు. కానీ “నారప్ప” విషయంలో ఇప్పటికే ఒప్పందం పూర్తయ్యింది. తాజాగా ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీలను కూడా పూర్తి చేసింది. అమెజాన్ ప్రైమ్ త్వరలో సినిమా విడుదల తేదీని ప్రకటించనుంది. కానీ వెంకీ అభిమానులు మాత్రం “నారప్ప” ఓటిటిలో విడుదలవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version