Venkatesh : తీవ్ర విషాదంలో వెంకీ మామ.. ఎమోషనల్ పోస్ట్

Venkatesh

Venkatesh

సంక్రాంతికి వచ్చిన సినిమాతో సూపర్ హిట్ అందుకున్న వెంకీ మామ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు జరుపుకున్నప్పటికీ, ఇంకా షూటింగ్ మొదలు కాలేదు. అయితే, తాజాగా వెంకీ మామ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన ఎంతో ముద్దుగా పెంచుకుంటున్న గూగుల్ అనే కుక్క మరణించింది.

Also Read : Sivaji: నారా లోకేష్ ‘ప్రజా గొంతుక’.. నటుడు శివాజీ ఆసక్తికర వ్యాఖ్యలు

ఈ సందర్భంగా దానితో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వెంకటేష్, “గత 12 ఏళ్లుగా మా జీవితాలను నీ కండిషన్స్ లేని ప్రేమతో, అందమైన మెమరీస్‌తో నింపావు. నువ్వే మా సన్‌షైన్. ఈ రోజు నీకు గుడ్ బై చెప్పాల్సిన సమయం వచ్చేసింది. నువ్వు వెళ్ళిపోతూ మాకు మిగిల్చిన దుఃఖం మాటల్లో వర్ణించలేనిది. నిన్ను ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటా, మై డియర్ ఫ్రెండ్,” అంటూ రాసుకొచ్చారు. గూగుల్ అనే జర్మన్ షెఫర్డ్ జాతికి చెందిన కుక్కను వెంకటేష్ ఎంతో ఆప్యాయంగా, ముద్దుగా పెంచుకున్నారు. షూటింగ్ లేనప్పుడు తన నివాసంలో దానితోనే ఎక్కువ సమయం గడిపేవారని తెలుస్తోంది.