Trivikram: వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’పైనే గురూజీ ఆశలన్నీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trivikram: టాలీవుడ్లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు చెబితేనే ఒకప్పుడు థియేటర్లు కళకళలాడేవి. అయితే 2024 సంక్రాంతికి వచ్చిన ‘గుంటూరు కారం’ తీవ్రంగా నిరాశపరచడం, ఆ తర్వాత అల్లు అర్జున్, ఎన్టీఆర్‌లతో అనుకున్న ప్రాజెక్ట్‌లు వర్కవుట్ కాకపోవడం, ముఖ్యంగా తారక్‌తో తీయాల్సిన ‘గాడ్ ఆఫ్ వార్’ ఆలస్యం కావడంతో గురూజీ కెరీర్ కాస్త నెమ్మదించింది. దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత ఆయన నుంచి వస్తున్న సినిమా కావడంతో, గుంటూరు కారం ఫెయిల్యూర్‌ను జనాలు మర్చిపోవాలన్నా.. త్రివిక్రమ్ మళ్లీ ట్రాక్‌లోకి రావాలన్నా ఇప్పుడు రాబోతున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమా హిట్ కొట్టడం అత్యంత కీలకంగా మారింది.
‘నువ్వు నాకు నచ్చావు’, ‘మల్లేశ్వరి’ లాంటి ఎవర్ గ్రీన్ క్లాసిక్స్‌కు కథ, మాటలు అందించిన త్రివిక్రమ్.. విక్టరీ వెంకటేష్‌ను డైరెక్ట్ చేయడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఇప్పటికే ‘సంక్రాంతికి వస్తున్నాం’, ‘మన శంకర వరప్రసాద్’ విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్న వెంకటేష్.. ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. తాజాగా రిలీజ్ చేసిన ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ చూస్తుంటే వెంకీ మార్క్ ఫ్యామిలీ ఎమోషన్స్, త్రివిక్రమ్ మార్క్ పంచ్ డైలాగ్స్‌తో పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రెడీ అయినట్లు కనిపిస్తోంది.
Also Read
చాలా వాయిదాల తర్వాత ఈ సినిమా అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. నిజానికి దసరా హాలిడేస్ సీజన్‌ను మిస్ చేసుకుని, వీక్ డేస్‌లో థియేటర్లలోకి దిగుతుండటం ఒకరకంగా పెద్ద రిస్క్ అనే చెప్పాలి. అయితే సినిమాపై ఉన్న నమ్మకంతోనే మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ వస్తే దీపావళి వరకు లాంగ్ రన్ ఉంటుందని టీమ్ గట్టి నమ్మకంతో ఉంది. ఫ్యామిలీ కథలను తెరకెక్కించడంలో ఎక్స్పర్ట్ అయిన త్రివిక్రమ్.. వెంకీతో కలిసి మళ్లీ తన మ్యాజిక్‌ను రిపీట్ చేసి హిట్ కొడతారో లేదో చూడాలి.
తాజావార్తలు
-
Trivikram: వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’పైనే గురూజీ ఆశలన్నీ!
-
Pakistan LPG Crisis: పాకిస్థాన్‌లో గ్యాస్ సంక్షోభం.. సిలిండర్ ధర రూ.8,000 దాటింది!
-
Sajjala Ramakrishna Reddy : చంద్రబాబుపై సజ్జల ఫైర్.. స్థానిక ఎన్నికల్లో అరాచకాలు సాగుతున్నాయంటూ ఆగ్రహం
-
Harshith Reddy: ఆ ఒక్క రీజన్‌తో ప్రభాస్ అన్న మా సినిమాను సపోర్ట్ చేశాడు..
-
Jammu Kashmir: ‘‘కాశ్మీర్‌ను పాకిస్తాన్ రక్షిస్తోంది’’.. ఫరూఖ్ అబ్దుల్లా వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం..
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!