Vedant Madhavan: ప్రౌడ్ ఫాదర్ మూమెంట్.. ఏషియన్ గేమ్స్ బరిలో మాధవన్ కుమారుడు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vedant Madhavan: స్టార్ హీరోల వారసులు అంటే సాధారణంగా వెండితెరపై ఎంట్రీ ఇవ్వడానికే మొగ్గు చూపుతారు. అయితే అందుకు పూర్తి భిన్నంగా, తండ్రి ఇమేజ్‌తో ఏమాత్రం సంబంధం లేకుండా తనకంటూ సరికొత్త దారిని ఎంచుకుని దేశానికే గర్వకారణంగా మారాడు ప్రముఖ నటుడు ఆర్.మాధవన్ తనయుడు వేదాంత్ మాధవన్. ఈత కొలనులో ఇప్పటికే అంతర్జాతీయ రికార్డులను తిరగరాసిన ఈ యువ సంచలనం, ఇప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘20వ ఏషియన్ గేమ్స్-2026’ బరిలోకి దిగుతున్నాడు. స్విమ్మింగ్ పూల్‌లో రేసు కోసం ఏకాగ్రతతో సిద్ధమవుతున్న వేదాంత్ ఫొటోను మాధవన్ తాజాగా సోషల్ మీడియాలో పంచుకోగా, అది క్షణాల్లో వైరల్‌గా మారింది. ఫ్రీస్టైల్ స్విమ్మర్‌గా భారత్ తరఫున అద్భుతాలు సృష్టిస్తున్న వేదాంత్ ఖాతాలో ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ పతకాలున్నాయి. మలేషియన్ ఓపెన్‌లో ఏకంగా ఐదు స్వర్ణ పతకాలు కొల్లగొట్టి ప్రపంచం దృష్టిని ఆకర్షించిన అతడు.. డానిష్ ఓపెన్‌లో స్వర్ణం, రజతం కైవసం చేసుకున్నాడు. అలాగే లాత్వియన్, థాయ్‌లాండ్ ఓపెన్ టోర్నీలలో కాంస్యాలు గెలుచుకోవడంతో పాటు కామన్వెల్త్ యూత్ గేమ్స్‌లో ఐదో స్థానంలో నిలిచి సత్తా చాటాడు.
భారత స్విమ్మింగ్ విభాగంలో సరికొత్త ఆశలు రేపుతున్న అత్యుత్తమ యువ క్రీడాకారుల్లో వేదాంత్ ఒకడని సాక్షాత్తూ అధికారిక ఒలింపిక్స్ వెబ్సైట్ ప్రశంసల వర్షం కురిపించడం విశేషం. ఓ స్టార్ యాక్టర్ కొడుకుగా విలాసవంతమైన జీవితాన్ని గడపడం కంటే, క్రీడాకారుడిగా తనకంటూ ఓ సొంత గుర్తింపును తెచ్చుకోవడమే తన జీవిత ఆశయమని వేదాంత్ గతంలోనే స్పష్టం చేశాడు. తాను సాధించే విజయాలు తన సొంత కష్టార్జితం కావాలని, తోటి అథ్లెట్లు తనను కేవలం ఒక స్విమ్మర్‌గా గుర్తించి గౌరవించే స్థాయికి చేరడమే తన లక్ష్యమని గట్టిగా నమ్ముతున్నాడు. తన వెండితెర ప్రయాణం కంటే, కొడుకు ఎంచుకున్న క్రీడా రంగమే తనకు అత్యంత ప్రాధాన్యమని మాధవన్ పలు సందర్భాల్లో గర్వంగా చెప్పుకొచ్చారు. కోట్ల రూపాయల రెమ్యునరేషన్లు, స్టార్ డమ్ కంటే కూడా దేశ జెండాను రెపరెపలాడిస్తున్న కొడుకు ఘనతే తనకు కొండంత సంతృప్తిని ఇస్తుందని చాటిచెప్పారు. ఇప్పుడు ఏషియన్ గేమ్స్ వంటి మెగా ఈవెంట్లో దేశం తరఫున పతకం సాధించేందుకు వేదాంత్ కఠోర సాధన చేస్తుండటంతో, యావత్ భారతావని అతనికి శుభాకాంక్షలు తెలుపుతోంది.
Also Read
- The Paradise: అనిరుధ్ స్టూడియో నుంచి నాని ‘చిన్న లీక్’.. ‘ది ప్యారడైజ్’ 3rd సింగిల్‌పై క్రేజీ వీడియో వైరల్! చూశారా
- Chiru Leaks: 'కాకా'లో అసలు క్యారెక్టర్ పేరు చెప్పేసిన మెగాస్టార్.. ఫ్యాన్స్‌కి పూనకాలే!
- Itlu Arjuna Teaser: మాటల్లేవ్... మాట్లాడుకోవడాలు లేవ్... డైలాగ్స్ లేకుండానే అనీష్ నటన అదుర్స్..
- Sangeet First Single: ఏఆర్ రెహమాన్ చేతుల మీదుగా ‘నీ వల్లే’ సాంగ్ రిలీజ్.. సిద్ శ్రీరామ్ మెలోడీకి ఫిదా అవుతున్న ఫ్యాన్స్!
తాజావార్తలు
-
Vedant Madhavan: ప్రౌడ్ ఫాదర్ మూమెంట్.. ఏషియన్ గేమ్స్ బరిలో మాధవన్ కుమారుడు!
-
Garba Row: గర్బాలో ముస్లింల ఎంట్రీపై వివాదం.. నుదిటిపై తిలకం తప్పనిసరి!
-
CM Chandrababu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
-
Upcoming IPOs : వచ్చే వారం మార్కెట్లో ఐపీఓల జాతర.. ఏకంగా 19 కంపెనీల ఎంట్రీ! పూర్తి వివరాలు ఇవే..
-
Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు…
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!