టాలీవుడ్ యంగ్ హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇప్పటివరకు నటించిన సినిమాలు అన్ని మంచి హిట్ టాక్ ను అందుకున్నాయి… ప్రస్తుతం ఆపరేషన్ వాలెంటైన్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. మార్చి 1న రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిన్న చిరంజీవి ముఖ్య అతిథిగా గ్రాండ్ గా నిర్వహించారు.. ఈ ఈవెంట్ లో చిరంజీవి మాట్లాడిన మాటలు హైలెట్ గా నిలిచాయి..
ఈక్రమంలోనే వరుణ్ తేజ్ నటించిన మొదటి మూవీ గురించి కూడా అందరికి తెలియజేసారు.. వరుణ్ హీరోగా కాకుండా చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా నటించాడని తెలిసింది.. నాగబాబు, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఆ చిత్రంలో చిరంజీవి గెస్ట్ రోల్ లో కనిపించారు. ఆ గెస్ట్ అపిరెన్స్ లో చిరంజీవితో పాటు వరుణ్ తేజ్ కూడా కనిపిస్తారు. ఆ సమయానికి వరుణ్ వయసు పదేళ్లు.. ఆ సినిమా ఏంటంటే..‘హేండ్సప్’ అనే క్రైమ్ కామెడీ థ్రిల్లర్ చిత్రం. శివ నాగేశ్వర రావు డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి హీరోయిన్ జయసుధ కథని అందించడం విశేషం.
ఆ సినిమాకు స్టోరీ ఇవ్వడంతో పాటు మూవీలో ముఖ్య పాత్రని పోషించారు. ఇక ఈ సినిమాలోని ఓ ఫైట్ సన్నివేశంలో సోనూసూద్ ని చిరంజీవి కొట్టిపడేస్తారు. ఆ సీన్ లోనే వరుణ్ తేజ్ అలా ఓ డైలాగు చెప్పి వెళ్ళిపోతాడు.. ఆఫరేషన్ వాలెంటైన్ సినిమా విషయానికొస్తే..తెలుగు, హిందీ భాషల్లో బై లింగువల్ గా ఈ మూవీ తెరకెక్కింది. మానుషీ చిల్లర్, రుహాణి శర్మ, నవదీప్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం.. తెలుగు ఫస్ట్ ఎయిర్ ఫోర్స్ మూవీగా రాబోతుంది. ఇప్పటివరకు విడుదల అయిన ట్రైలర్, టీజర్ సినిమా పై భారీగా అంచనాలను పెంచేస్తున్నాయి..