NTV Telugu Site icon

Varuntej : ‘మట్కా’పైనే వరుణ్‌తేజ్‌ ఆశలన్నీ.. హిట్టు దక్కేనా..?

Matka (2)

Matka (2)

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘మట్కా’ . వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్నారు. పలాస, శ్రీదేవి సోడాసెంటర్ వంటి సినిమాలు తెరకెక్కించిన కరుణ కుమార్  ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ టీజర్, ఫస్ట్, సెకండ్ సింగిల్స్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి.  ఇటీవల  మెగాస్టార్ చిరంజీవి ‘మట్కా’ ట్రైలర్ ని లాంచ్ చేశారు.

Also Read : DulquerSalmaan : లక్కీ భాస్కర్ 5 రోజుల కలెక్షన్స్.. సూపర్

‘సర్కస్ లో బఫున్స్ ని చూసి జనం అంతా నవ్వుతారు, చప్పట్లు కొడతారు, కానీ ఒక చిన్న కర్ర పట్టుకుని పులుల్ని సింహాల్ని ఆడించేవాడు ఒకడు ఉంటాడు. అలాంటోడే వీడు. రింగ్ మాస్టర్ ‘ వంటి డైలాగ్స్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. 1950 -80 బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ కథలో వరుణ్ తేజ్ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్, గెటప్స్ ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేశాయి. వాసు క్యారెక్టర్ లో ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ తో కట్టిపడేశారు వరుణ్ తేజ్.

Also Read : Daayra : పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ సరసన కరీనా కపూర్

కాగా ఈ సినిమా హిట్ వరుణ్ తేజ్ కు ఎంతో కీలకం. ఇటీవల వరుస ఫ్లోప్స్ తో సతమత మవుతున్నాడు ఈ యంగ్ హీరో. 2019లో వచ్చిన గద్దల కొండ గణేష్ తర్వాత ఆరేంజ్ హిట్ కోసం ప్రయత్నిస్తున్నాడు వరుణ్ తేజ్. మధ్యలో వచ్చిన గని, గాండీవధారి అర్జున భారీ డిజాస్టర్లు గా నిలిచాయి. మరోసారి తనకు లాస్ట్ హిట్ ఇచ్చిన యదార్ధ సంఘటనల ఆధారంగా వస్తున్న మాస్ సబ్జెక్ట్ ను ఎంచుకున్నాడు వరుజ్. ఈ నెల 14న కంగువ తో పోటీగా రిలీజ్ అవుతున్న మట్కావరుణ్ తేజ్ ను ససక్సెస్ ట్రాక్ ఎక్కిస్తోందో లేదో మరికొద్ది రోజుల్లో తేలుతుంది.

Show comments