NTV Telugu Site icon

Varun – Lavanya : పెళ్లికి ముందే మొదలెట్టేసిన వరుణ్, లావణ్య.. పిక్స్ వైరల్..

Varu Lavanya

Varu Lavanya

టాలివుడ్ హీరో, హీరోయిన్లు లావణ్య, వరుణ్ తేజ్ లు గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటూ.. ఇటీవలే కుటుంబ సభ్యుల సమక్షంలో గ్రాండ్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే.. త్వరలోనే ఈ జంట పెళ్లితో ఒక్కటవ్వ బోతున్నారు..దాదాపు 5 ఏళ్ళ పాటు రహస్య ప్రేమాయణం నడిపిన వీరిద్దరూ ఇటీవల ఇరు కుటుంబసభ్యుల మధ్య ఎంగేజ్మెంట్ రింగ్స్ ని మార్చుకున్నారు. ఇక నిశ్చితార్థం తరువాత కూడా బయట పెద్దగా కలిసి కనిపించని ఈ జంట..

తాజాగా జిమ్ లో కలిసి వర్క్ అవుట్స్ చేస్తూ కనిపించారు. జిమ్ లోని ఫోటోని వరుణ్ తన ఇన్‌స్టాగ్రామ్ లో స్టోరీలో షేర్ చేశాడు.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషలో మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఇక ఈ స్టోరీని లావణ్య మళ్ళీ రీ షేర్ చేస్తూ.. వరుణ ‘వర్క్ అవుట్ బడ్డీ’ కామెంట్ ముందు బెస్ట్ యాడ్ చేసింది. వరుణ్ కన్నా తానే బెస్ట్ వర్క్ అవుట్ బడ్డీ అనే ఉద్దేశంతో కామెంట్ చేసినట్లు ఉంది. ప్రస్తుతం ఈ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి… ఇక వీరిద్దరి పెళ్లి ఈ ఏడాదిలోనే జరగనుందని సమాచారం..

డెస్టినేషన్ వెడ్డింగ్‌లా జరుపుకోబోతున్నారు. పెళ్లి వేదికకు కోసం ఇండియాలో అండ్ ఫారిన్ లో కొన్ని ప్లేస్ లు పరిశీలనలో ఉన్నాయట. ఈ పెళ్లి కార్యక్రమాన్ని కూడా కేవలం ఇరు కుటుంబాలు మధ్యనే జరుపుకోనున్నారు.. ఇక వరుణ్ తేజ్ సినిమాల విషయానికొస్తే.. గాండీవధారి అర్జున’ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. టీజర్, ట్రైలర్ తో ఆడియన్స్ ని ఆకట్టుకున్నప్పటికీ.. థియేటర్స్ లో మాత్రం మెప్పించలేకపోయింది..ప్రస్తుతం ‘ఆపరేషన్ వాలెంటైన్’, ‘మట్కా’ చిత్రాల్లో నటిస్తున్నాడు. ఆపరేషన్ వాలెంటైన్ షూటింగ్ ఆల్రెడీ మొదలైంది. మట్కా మాత్రం ఓపెనింగ్ మాత్రం అయ్యింది… పెళ్లి తర్వాతే సెట్స్ మీదకు వెళ్లనుందని సమాచారం..

Show comments