Site icon NTV Telugu

Varun : విజయ్ ‘తేరి’ రీమేక్ ట్రైలర్ వచ్చేసింది చూసారా..?

Baby

Baby

తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా అట్లీ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘తేరి’. అట్లీ, విజయ్ కాంబోలో తోలిసారిగా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాను పోలీసోడు పేరుతో తెలుగులో రీమేక్ చేసారు. టాలీవుడ్ లోను ఈ సినిమా హిట్ గా నిలిచింది. పోలీస్ పాత్రలో విజయ్ ను పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా చూపించాడు అట్లీ. కాగా ఈ సినిమాను పలు భాషల్లో రీమేక్ చేస్తున్నారు.

ఆ కోవలోనే ఈ సినిమాను హిందీలో ‘‘బేబీ జాన్‌” అనే  పేరుతో  రీమేక్ చేసారు. బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ హీరోగా కీర్తి సురేశ్‌ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ను నేడు రిలీజ్ చేసారు మేకర్స్. బాలీవుడ్ సీనియర్ నటుడు జాకీష్రాఫ్ విలన్ గా నటిస్తున్నాడు. కాలీస్‌ దర్శకత్వంలో రానున్న ఈ ఇంటెన్స్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రాన్ని మురాద్‌ ఖేతానీ, ప్రియా అట్లీ, జ్యోతి దేశ్‌పాండే సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అట్లీ, జియో స్టూడియోస్ సగర్వంగా సమర్పిస్తున్న ఈసినిమాను ఈ ఏడాది క్రిస్టమస్ కానుకగా డిసెంబరు 25న వరల్డ్  వైడ్ గా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. తెలుగులో తేరి మూలకథతో పవర్ స్టార్ ‘పవన్  కళ్యాణ్’ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పేరుతో మైత్రి మూవీస్ నిర్మిస్తున్నారు.

Also Read : Garudan : బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా టైటిల్ ఇదే..

Exit mobile version