Varanasi Release Date: ఏప్రిల్ 7న ‘వారణాసి’ వస్తుందా?.. ఎన్టీఆర్ ప్రశ్నకు రాజమౌళి సమాధానం ఇదే!

Ss Rajamouli Jr Ntr Varanasi Release Date

Ss Rajamouli Jr Ntr Varanasi Release Date

Jr NTR asked SS Rajamouli about Varanasi Release Date: మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ హీరోగా నటించిన ఫాంటసీ ఎంటర్‌టైనర్ ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. శశాంక్ ఏలేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాను శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్ఎస్ కార్తికేయ సంయుక్తంగా నిర్మించారు. అక్టోబర్ 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్రబృందం మంగళవారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్‌, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్‌ అభిమానులతో ఆసక్తికరమైన సంభాషణ జరిపారు. ఇక్కడికి వచ్చిన అందరికీ థాంక్స్, జాగ్రతగా ఇంటికి వెళ్లండి అని అభిమానులను టైగర్ కోరారు. త్వరలోనే ‘డ్రాగన్’తో మీ ముందుకు వస్తానని చెప్పారు. నేను డ్రాగన్ అప్‌డేట్‌ ఇచ్చేముందు.. ‘సూపర్‌ స్టార్’ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘వారణాసి’ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ జక్కన్న ఇస్తాడేమో అడుగుదాం అన్నారు. ‘నేను అప్‌డేట్ ఇచ్చే ముందు.. ఈ మహానుభావుడు (రాజమౌళి) వారణాసి గురించి ఏదైనా అప్‌డేట్ ఇస్తాడేమో చూద్దాం’ అని టైగర్ అన్నారు. ‘వారణాసి ఏప్రిల్ 7న వస్తుందా?’ అని ఎన్టీఆర్‌ ప్రశ్నించారు. దీనికి రాజమౌళి ‘తప్పకుండా’ అంటూ సమాధానం ఇచ్చారు.

దీంతో ఎన్టీఆర్‌ వెంటనే ఏప్రిల్ 7న వారణాసి వస్తుంది.. అందరూ రెడీగా ఉండండి అంటూ ప్రకటించారు. దీంతో ఈవెంట్‌లో ఒక్కసారిగా అభిమానులు సందడి చేశారు. ఇప్పటివరకు వారణాసి విడుదల తేదీపై ప్రచారం జరుగుతుండగా.. తాజాగా రాజమౌళి సమక్షంలో ఎన్టీఆర్‌ చేసిన ఈ ప్రకటనతో రిలీజ్ డేట్‌పై మరింత స్పష్టత వచ్చినట్లైంది. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న వారణాసిపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్-వరల్డ్ యాక్షన్ అడ్వెంచర్ కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.