Varanasi Movie: ‘వారణాసి’లో టైమ్ ట్రావెల్ ట్విస్ట్.. కుంభకర్ణుడి పునర్జన్మగా ఆ పాత్ర?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prithviraj Sukumaran’s Kumbha Character: బాలీవుడ్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన ‘రామాయణ: పార్ట్ 1’కు ప్రపంచవ్యాప్తంగా అద్భుత స్పందన దక్కుతోంది. నవంబర్ 5న రిలీజైన ఈ మూవీ.. నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లు కొల్లగొట్టింది. ఈ సినిమా విడుదలైన తర్వాత రామాయణ గాథకు సంబంధించిన అంశాలపై సోషల్ మీడియాలో చర్చలు జోరందుకున్నాయి. ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వారణాసి’ సినిమా పైనా ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా ఈ సినిమా కథ, పాత్రల నేపథ్యంపై రకరకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి.
తాజాగా రెడ్డిట్‌లో వారణాసిపై ప్రచారంలో ఉన్న ఓ స్టోరీ థియరీ సినీ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. సినిమాలో మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ పోషిస్తున్న ‘కుంభ’ పాత్రకు రామాయణంలోని కుంభకర్ణుడితో సంబంధం ఉండొచ్చని అంటున్నారు. కుంభకర్ణుడి పునర్జన్మగా కుంభ పాత్రను చూపించనున్నారనేది ఈ కథనం సారాంశం. రావణుడికి సంబంధించిన నవరత్న మాలను సొంతం చేసుకోవడమే కుంభ లక్ష్యమని ఈ థియరీలో పేర్కొంటున్నారు. ఆ నవరత్న మాలలోని తొమ్మిది శక్తివంతమైన రత్నాలను ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించేందుకు రుద్ర (మహేశ్ బాబు పోషిస్తున్న పాత్ర)ను కుంభ పంపిస్తాడని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో కథ అనేక దేశాలు, విభిన్న ప్రాంతాల నేపథ్యంలో సాగుతుందట.
Also Read
- Anirudh-Kavya Wedding: అనిరుధ్-కావ్య మారన్ పెళ్లికి వేళాయే.. వివాహం తేదీ, స్థలం, పూర్తి వివరాలు ఇవే..
- Box Office Collection: కోలీవుడ్ కల కలగానే మిగిలిపోనుందా? ₹1000 కోట్ల టార్గెట్‌కు బ్రేక్ పడినట్లేనా..!
- Ramayana Record: ‘రామాయణ’ రికార్డుల జాతర.. ‘పుష్ప 2’, ‘ధురంధర్ 2’ను దాటేసి టాప్‌లోకి!
- Ramayana Box Office: 'ఆదిపురుష్' రికార్డు అవుట్.. భారీ కలెక్షన్స్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘రామాయణం’..
వారణాసి కథలో అత్యంత ఆసక్తికరమైన అంశం టైమ్ ట్రావెల్ ట్విస్ట్ అని మరో వెర్షన్ వైరల్ అవుతోంది. కథానాయకుడు ఒక వార్మ్‌హోల్ ద్వారా రామాయణ కాలానికి చేరుకుంటాడని, రామ-రావణ యుద్ధ సమయంలో జరిగిన కీలక సంఘటనలో జోక్యం చేసుకుంటాడట. గతంలో చోటుచేసుకున్న పరిణామాలను మార్చడం ద్వారా నవరత్నాల భవిష్యత్తు కూడా మారుతుందని ప్రచారం సాగుతోంది. అయితే ఇవన్నీ ప్రస్తుతం రెడ్డిట్‌లో చక్కర్లు కొడుతున్న ఊహాగానాలు, కథా సిద్ధాంతాలు మాత్రమే. మరి దర్శకధీరుడు రాజమౌళి తనదైన కథనంతో ఈ అంశాలను ఎలా మలుస్తారన్నది తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే.
తాజావార్తలు
-
Varanasi Movie: ‘వారణాసి’లో టైమ్ ట్రావెల్ ట్విస్ట్.. కుంభకర్ణుడి పునర్జన్మగా ఆ పాత్ర?
-
Anirudh-Kavya Wedding: అనిరుధ్-కావ్య మారన్ పెళ్లికి వేళాయే.. వివాహం తేదీ, స్థలం, పూర్తి వివరాలు ఇవే..
-
Keesara SI: కీసర పీఎస్‌లో ఆగని లంచావతారాలు.. రూ.2 లక్షలతో ఏసీబీకి చిక్కిన ఎస్సై శ్రీనివాస్!
-
Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. చిన్నారి సహా ఆరుగురు సజీవదహనం.!
-
Arjun Ram Meghwal: బీఎస్ఎఫ్ జవాన్లతో దీపావళి సంబరాలు.. కేంద్ర మంత్రికి తృటిలో తప్పిన ప్రమాదం!
ట్రెండింగ్
-
Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!
-
IPL 2027: టీమిండియా పవర్ హిట్టర్‌పై కన్ను.. గుజరాత్ టైటాన్స్‌ది పెద్ద ప్లానే!
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!