మాస్క్ తో మన ప్రయోగాలు… స్టార్స్ ఫన్నీ వీడియో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మహమ్మారి కారణంగా మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం, శానిటైజర్ తో చేతులు శుభ్రపరుచుకోవడం అనేది మానవ జీవితాల్లో రోజూవారీ దినచర్యగా మారిపోయింది. కరోనా కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. మరెంతో మంది ఇప్పటికి ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. కరోనా సెకండ్ వేవ్ లో ఈ మహమ్మారి అత్యంత్య వేగంగా వ్యాపిస్తూ ఉండడం, రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతుండడంతో దేశం మొత్తం వణికిపోయింది. అంతేనా మరోమారు రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ దిశగా నిర్ణయం తీసుకునేలా చేసింది. ప్రస్తుతం కొంత వరకు కేసులు తగ్గాయి. అయితే గత ఏడాది నుంచి ఇప్పటి వరకు ఇంత జరుగుతున్నా, ఎంతోమంది కరోనా జాగ్రత్తల గురించి అవగాహన కల్పిస్తున్నప్పటికీ కొంతమంది చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వారి వల్ల వారికే కాకుండా వారి చుట్టు పక్కల ఉండే ప్రజలకు కూడా ప్రమాదం. అంతేకాదు మరిన్ని కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది. అయితే తాజాగా సౌత్ సెలెబ్రిటీలు మాస్క్ తో నిర్లక్ష్యంగా వ్యవహరించేవారు చేసే ప్రయోగాలను ఫన్నీ గా చూపిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. అందులో చివరగా అసలు మాస్కును ఎలా ధరించాలో కూడా చూపించారు. ఈ వీడియోలో వరలక్ష్మి శరత్ కుమార్, ఐశ్వర్య రాజేష్, రెజీనా కాసాండ్రా, సందీప్ కిషన్, కృష్ణ, సతీష్, ప్రియదర్శి, యోగిబాబు, విద్యురామన్ తదితరులు కన్పించారు. వరలక్ష్మి ఈ వీడియోను పోస్ట్ చేస్తూ తాను అడగ్గానే సహకరించిన సెలెబ్రిటీలు అందరికి కృతజ్ఞతలు తెలిపారు.
Also Read
- Rakesh Varre : 'బ్లడ్ బాత్' సినిమాలకు చెక్.. మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'మాయలేడి'తో వస్తున్నాం!
- It's a Medical Miracle : కోమా నుంచి లేవగానే అకస్మాత్తుగా సూపర్ పవర్స్.. ఓటీటీలో క్రైమ్ కామెడీ సెన్సేషన్
- Sushmitha Shetty : ప్రేమ కోసం తెలియకుండానే ఆ క్రైమ్‌లో ఇరుక్కున్నా
- Anirudh Ravichander: అనిరుధ్ సక్సెస్ వెనుక ఆ స్టార్ హీరో.. ఐశ్వర్య రజనీకాంత్ కామెంట్స్ వైరల్!
తాజావార్తలు
-
Off The Record: మంత్రి పుట్టలో వేలు పెట్టారా? ఢిల్లీలో దామోదర వర్సెస్ ఎమ్మెల్యే!
-
Off The Record: మంత్రి వర్సెస్ ఎంపీ.. పెద్దపల్లి కాంగ్రెస్‌లో ఓపెన్ లెటర్ల వార్
-
Rakesh Varre : ‘బ్లడ్ బాత్’ సినిమాలకు చెక్.. మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మాయలేడి’తో వస్తున్నాం!
-
Off The Record: ఆవేదనా? ఆక్రోశమా? రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల వెనుక అసలు కథ!
-
Nithiin Narne: షూటింగ్ స్పాట్లో తీవ్ర గాయం.. యంగ్ హీరో నితిన్ నార్నేకు సర్జరీ
ట్రెండింగ్
-
ICC ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.. టాప్ ప్లేస్‌కు మిచెల్ స్టార్క్.. ఏడో స్థానానికి శ్రేయస్ అయ్యర్..!
-
Sanna Karam Pusa Recipe: ఆయిల్ పీల్చకుండా కరకరలాడే ‘సన్న కారపూస’.. పక్కా కొలతలతో ఈజీగా చేసేయండి ఇలా..!
-
Motichoor Laddu Recipe: దీపావళి స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే ‘మోతిచూర్ లడ్డు’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!
-
IND vs NZ: ఆక్లాండ్‌లో ‘కింగ్’ షో.. తొలి వన్డేలో భారత్ విజయం..!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 188 కి.మీ ప్రయాణం.. స్పోర్టీ లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ Hero VIDA VXZ..