కోలీవుడ్ స్టార్ హీరో తలా అజిత్ కుమార్ అభిమానులు సోషల్ మీడియాలో సరికొత్త ట్రెండ్ ను సృష్టిస్తున్నారు. ఇంతకుముందు కన్నా ఇప్పుడు తమ అభిమాన నటీనటులపై ప్రేమను చూపించడానికి సోషల్ మీడియాను బాగా వినియోగిస్తున్నారు నెటిజన్లు. తాజాగా అజిత్ డై హార్డ్ ఫ్యాన్స్ కూడా అలాగే ఈ హీరో రాబోయే సినిమాపై ఆసక్తిని చూపించి ట్రెండ్ సెట్టర్ గా మారారు. హెచ్ వినోద్ దర్శకత్వంలో ప్రస్తుతం అజిత్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ “వాలిమై”. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఇంకా కనీసం ఫస్ట్ లుక్ విడుదల కాలేదు. కానీ నెట్టింట్లో #VALIMAIcreatesHistoryInBMS అనే హ్యాష్ ట్యాగ్ తో దుమ్మురేపుతున్నారు ఆయన అభిమానులు.
Read Also : ‘తెర’వలేం: జులైలోను బొమ్మ పడటం కష్టమే?
వన్ మ్యాన్ ఆర్మీ అంటూ సింగిల్ అప్డేట్ కూడా లేకుండానే, ఏకంగా ఫస్ట్ లుక్ విడుదలకు ముందే బుక్ మై షో అనే యాప్ లో 1 మిలియన్ ఇంటరెస్ట్స్ తో సరికొత్త హిస్టరీ క్రియేట్ చేశారు. ఈ చిత్రంలో హుమా ఖురేషి, కార్తికేయ గుమ్మకొండ, యోగి బాబు, సుమిత్రా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని బోనీ కపూర్ తన సొంత బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. దాదాపు గత రెండు సంవత్సరాలుగా వాలిమై’ అప్డేట్ గురించి ఎదురు చూస్తున్నారు అజిత్ అభిమానులు. ఈ సినిమా నిర్మాత బోనీ కపూర్ త్వరలో అప్డేట్ ఇస్తారనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఏడాది మే 1న అజిత్ పుట్టినరోజును పురస్కరించుకుని ‘వాలిమై’ ఫస్ట్ లుక్ విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా వైరస్ మహమ్మారి కారణంగా చిత్ర ప్రమోషన్లను వాయిదా వేశారు మేకర్స్. ‘వాలిమై’ ఫస్ట్ లుక్ పోస్టర్, విడుదల తేదీని వచ్చే నెలలో ప్రకటించనున్నట్లు సమాచారం. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మరి అజిత్ ఫ్యాన్స్ సెట్ చేసిన ఈ హిస్టరీని ఏ హీరో ఫ్యాన్స్ బ్రేక్ చేస్తారో చూడాలి.