స్టార్ సినిమాలపై ‘వకీల్ సాబ్’ దెబ్బ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాలానుగుణంగా వచ్చిన మార్పుల వల్ల సినిమాల లాంగ్ రన్ తగ్గిపోయింది. శతదినోత్సవాలు కరువై అర్థశతదినోత్సవాలే దిక్కయ్యాయి. ఇప్పుడు అదీ పోయింది ఓపెనింగ్ వీక్ లో ఎంత వస్తే అంతే. అయితే స్టార్ హీరోల సినిమాల వరకూ కొంత వెలుసుబాటు ఉండేది. కొంతలో కొంత బాగున్న స్టార్ హీరోల సినిమాలు 5, 6 వారాలు గట్టిగా నిలబడి 50 రోజులైనా ఆడేవి. కరోనా తర్వాత ఓటీటీ ట్రెండ్ తో అదీ కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడింది. ఇటీవల కాలం వరకూ పెద్ద హీరోల సినిమాలను 50 రోజుల తర్వాతే శాటిలైట్ ఛానెల్స్ లో విడుదల చేసేవారు. ఇప్పుడు ఓటీటీలో రెండో వారం మూడో వారం తర్వాత రిలీజ్ కి రెడీ అనేస్తున్నారు. దీని ప్రభావం రాబోయే స్టార్ హీరోల సినిమాలపై పడబోతుందంటున్నారు పంపిణీదారులు, ప్రదర్శనదారులు.
ఏప్రియల్ 9న థియేటర్లలో విడుదలై చక్కటి విజయాన్ని సాధించింది ‘వకీల్ సాబ్’. ‘పింక్’ రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో లాయర్ సత్యదేవ్ పాత్రతో అటు ఫ్యాన్స్ ను ఇటు ఆడియన్స్ ను అలరించారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ప్రైమ్ వీడియోలో ఏప్రిల్ 30 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు ప్రైమ్ ట్వీట్ చేసి నిర్ధారంచింది. ఇది థియేటర్ లో సినిమా చూడని వారికి ఆనందాన్ని కలిగిస్తే వందలకు వందలు వదిలించుకుని సినిమా చూసిన వారు అయ్యో ఒకటిరెండు వారాలు అగిఉంటే చాలా డబ్బులు ఆదా అయ్యేవని ఫీలవుతున్నారు.
Also Read
- Mrunal Thakur-Yashasvi Jaiswal Dating: యశస్వితో రిలేషన్షిప్.. మృణాల్ ఠాకూర్ కామెంట్స్ వైరల్.. నిజమెంత?
- Ramayana: షాక్ ఇచ్చిన మేకర్స్.. విదేశాల్లో రెండు రోజుల ముందే ‘రామాయణం’...
- Adnan Sami: మూడు పెళ్ళిళ్ళు విఫలమైనా.. పాకిస్తాన్ జనరల్స్ నాపాటకి స్టెప్పులేస్తారు.. అద్నాన్ సమి జీవితంలో ఈ మలుపులేంటి?
- Trivikram: త్రివిక్రమ్‌తో మా బంధం అలాంటిది.. ఎలాంటి అగ్రిమెంట్లు లేవు: నాగవంశీ
ఇదే టాలీవుడ్ లో కొత్త చర్చకు కారణమవుతోంది. కనీసం 50 రోజుల గ్యాప్ కూడా లేకుండా ఇలా ఓటీటిలో రిలీజ్ చేస్తే త్వరలో రిలీజ్ అయ్యే పెద్ద హీరోల సినిమాలకు ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు. సంక్రాంతికి వచ్చిన విజయ్ ‘మాస్టర్’… ఇప్పుడు ‘వకీల్ సాబ్’ మూడు వారాల్లోనే ఓటీటిలో వచ్చేయటంతో రాబోయే పెద్ద సినిమాలు కూడా అతి తక్కువ టైమ్ లో ఓటీటిలో వచ్చేస్తాయి… ఇక థియేటర్ కి వెళ్ళి డబ్బులు దండగ చేసుకోవడం ఎందుకు అని జనం థియేటర్లకు వెళ్లటం మానేస్తారు. అది పెద్ద సినిమాలపై దారుణమైన ప్రభావం చూపిస్తుందంటున్నారు. గతంలో నిర్మాతలు కలసి మాట్లాడుకుని థియేటర్ రిలీజ్ కు ఓటీటి లేదా శాటిలైట్ ప్రీమియర్ రిలీజ్ కు మధ్య నాలుగు నుంచి ఆరు వారాల మినిమం గ్యాప్ ఉండాలనే నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడా నిబంధనకు నీళ్ళు వదిలేసినట్లే. ‘వకీల్ సాబ్’ ఓటీటీ విడుదల విషయంలో సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను ఖండించిన దిల్ రాజు 50 రోజుల వరకూ ఓటీటీలో రాదని చెప్పారు. కట్ చేస్తే కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతంగా ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లను మూసివేశారు. దీంతో ‘వకీల్ సాబ్’ను ఓటీటీలో విడుదల చేయక తప్పలేదు. ఒక వేళ ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే స్టార్ హీరోలు, పెద్ద సినిమాల థియేట్రికల్ బిజినెస్ పై భారీ ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. మరి కరోనా కాలం వరకే ఇలా చేస్తారా? లేక ఆ తర్వాత కూడా సినిమాలు విడుదలైన స్వల్ప వ్యవధిలోనే ఓటీటీలో రిలీజ్ చేస్తారా!? అన్నది చూడాలి.
- Tags
- OTT Release
- Vakeel Saab
తాజావార్తలు
-
OTR : తెలంగాణ బీజేపీకి కొత్త సారథి? మళ్లీ బండి సంజయ్‌కే పగ్గాలు!
-
Story Board : బంగ్లా మరో పాకిస్తాన్ లా మారుతుందా..?
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్లకు ఫుల్ డిమాండ్.. 7,340 ఇళ్లకు 35 వేల దరఖాస్తులు!
-
Russia-India Rail Route: భారత్‌కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
-
Lionel Messi’s Father Passed Away: మెస్సీ కన్నీళ్ల వెనుక అసలు కారణం ఇదేనా? తండ్రి జార్జ్ ఇక లేరు
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!