‘పవర్ స్టార్’ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ మూవీ ఇప్పటికే షూటింగ్ ఫినిష్ చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఈ ఏడాది సమ్మర్‌లోనే రిలీజ్‌కు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు మేకర్స్ చెప్పిన దాని ప్రకారం.. ఈ చిత్రం ఏప్రిల్ నెలలో రిలీజ్‌కు షెడ్యూల్ చేయబడి ఉంది. అయితే లేటెస్ట్‌గా ఉస్తాద్ కాస్త ముందుకొచ్చి మార్చిలో థియేటర్లోకి రాబోతోందని తెలుస్తోంది.
నిజానికి మార్చి 27న రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ రిలీజ్ కావాల్సి ఉంది. అయితే షూటింగ్ డిలే కారణంగా పెద్ది ఆల్మోస్ట్ వాయిదా పడినట్టేనని తెలుస్తోంది. దీంతో అదే డేట్‌కి ఉస్తాద్ భగత్ సింగ్ రావడానికి రంగం సిద్ధం చేస్తున్నట్టుగా సమాచారం. అతి త్వరలోనే అధికారికంగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఇదే నిజమైతే పవన్ ఫ్యాన్స్‌కు పండగేనని చెప్పాలి. ఇక గబ్బర్ సింగ్ కాంబినేషన్ రిపీట్ చేస్తూ హరీశ్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Also Read: T20 World Cup 2026: వరల్డ్‌కప్ కలలు ఛిద్రం.. చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి!
ఉస్తాద్ భగత్ సింగ్‌లో పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల, రాశిఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే మరిన్ని అప్డేట్స్‌తో పాటు సెకండ్ సాంగ్ రిలీజ్‌కు రెడీ అవుతున్నారు మేకర్స్. ఓజీ తర్వాత పవర్ స్టార్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఉస్తాద్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. మరి ఉస్తాద్ భగత్ సింగ్ ఎలా ఉంటుందో చూడాలి.
