Site icon NTV Telugu

Keerthy Suresh & Suhas : ‘ఉప్పు కప్పురంబు’ డైరెక్ట్ ఓటీటీలోకి..

Uppu Kappu Rambu, Ott Release,

Uppu Kappu Rambu, Ott Release,

టాలీవుడ్ నేషనల్ అవార్డ్ విన్నింగ్ హీరోయిన్ కీర్తి సురేష్, యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సుహాస్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘ఉప్పు కప్పురంబు’. ఎల్లనార్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై రాధిక లావు నిర్మించిన ఈ చిత్రానికి అని. ఐ.వి. శశి దర్శకత్వం వహించారు. కీర్తి సురేష్, సుహాస్ తో పాటుగా బాబు మోహన్, శత్రు తళ్లూరి రామేశ్వరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం, నేరుగా ఓటీటీలో అమెజాన్ ప్రైమ్ వీడియో ఒరిజినల్ మూవీగా విడుదల కానుంది.

Also Read : Kubera: ఈ సినిమాతో నా కల నెరవేరింది.. రష్మిక

జూలై 4న నుండి తెలుగు ప్రేక్షకులకే కాకుండా దేశ వ్యాప్తంగా విస్తృతంగా ఈ సినిమాను అందుబాటులోకి తీసుకురావాలని నిర్మాతలు నిర్ణయించారు. అందుకే ఈ మూవీని తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో డబ్ చేసి ప్రపంచవ్యాప్తంగా 240 కి పైగా దేశాలు, ప్రాంతాల్లో ప్రైమ్ వీడియో ద్వారా ప్రసారం చేయనున్నారు. ఇక కథ విషయానికి వస్తే .. ఈ సినిమా కథ 1990 నాటి కాలం నడుస్తోంది. గ్రామీణ వాతావరణంలో సాగే, చమత్కారం , హాస్యభరితంగా ఈ సినిమా తెరకెక్కింది. ప్రేక్షకులకు నవ్వు పంచడమే కాకుండా ఒక ఆలోచన రేకెత్తించే విధంగా చిత్రాన్ని తెరకెక్కించామని చిత్ర బృందం తెలిపింది. “ఇలాంటి విలక్షణమైన గ్రామీణ నేపథ్య చిత్రాన్ని నిర్మించడం ఆనందంగా ఉంది” అని నిర్మాత రాధిక లావు పేర్కొన్నారు.

Exit mobile version