Upasana Konidela: పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్’తో నరకం చూశా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా కోడలు, అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్పర్సన్ ఉపాసన కొణిదెల ఎప్పుడూ నవ్వుతూ, ఎంతో ఉత్సాహంగా కనిపిస్తుంటారు. కానీ, ఆ చిరునవ్వు వెనుక ఎవరికీ తెలియని ఓ తీవ్రమైన మానసిక వేదన దాగి ఉందంటూ ఆమె బహిరంగ వేదికపై తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మంగళవారం ఉదయం హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అపోలో ఆసుపత్రిలో ‘అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్’ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ ప్రెస్మీట్లో మాట్లాడిన ఉపాసన.. తన సెకండ్ ప్రెగ్నెన్సీ, ఆ తర్వాత తాను ఎదుర్కొన్న పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. “పైకి ఎంతో ఆనందంగా, నవ్వుతూ కనిపిస్తున్న ఈ ముఖం వెనుక.. ఇంకా తన గాయాలను మాన్పుకుంటున్న ఓ తల్లి ఉంది” అంటూ ఉపాసన గొంతు బొంగురుపోయింది. తన సెకండ్ ప్రెగ్నెన్సీలో కవలలకు (twins) జన్మనిచ్చిన జర్నీ ఎంతో కఠినంగా గడిచిందని, దాని గురించి పూర్తిగా మాట్లాడేంతలా తన మనసు ఇంకా కుదుటపడలేదని ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. ఆ చేదు జ్ఞాపకాలను తలుచుకుంటూ.. “నా కాళ్లు వణుకుతున్నాయి.. నేనిక్కడే కూర్చుంటాను” అంటూ స్టేజిపైనే కుర్చీలో కూర్చుండిపోయారు. మొదటి డెలివరీ సమయంలో లేని ‘పోస్ట్‌పార్టమ్’ సమస్యలు సెకండ్ డెలివరీ తర్వాత తనను ఊహించని రీతిలో కుదిపేశాయని, ఆ మానసిక వేదన నుంచి తాను ఇంకా బయటపడుతూనే ఉన్నానని ఎమోషనల్ అయ్యారు.
తనకు రెండు ప్రెగ్నెన్సీల సమయంలో అడుగడుగునా అండగా నిలిచిన వైద్యులు డాక్టర్ సుమ, డాక్టర్ నమితలకు ఉపాసన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తొలిసారి గర్భంతో (మూడో త్రైమాసికం) ఉన్నప్పుడు భర్త రామ్ చరణ్ అవార్డ్స్ ఫంక్షన్ కోసం తాను లాస్ ఏంజిల్స్ వెళ్లాల్సి వచ్చిందని ఆమె గుర్తుచేసుకున్నారు. ఆ సుదీర్ఘ ప్రయాణంలో తనకు ఏమీ కాకూడదని తన డాక్టర్ సుమ అడుగడుగునా దేవుడిని ప్రార్థించారని, తాను తిరిగి ఇండియాలో అడుగుపెట్టే వరకు డాక్టర్‌కు ప్రాణాలు గుప్పెట్లోనే ఉన్నాయని ఆనాటి టెన్షన్ వాతావరణాన్ని పంచుకున్నారు. ప్రెగ్నెన్సీ అనేది కేవలం తొమ్మిది నెలలు, మూడు దశలకు (ట్రైమిస్టర్స్) మాత్రమే పరిమితం కాదని ఉపాసన ఉద్ఘాటించారు. గర్భం దాల్చడానికి ముందు ఉండే ఆందోళనను ఎవరూ పట్టించుకోరని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. “గర్భం కోసం ప్రయత్నించే సమయంలో పీరియడ్స్ మిస్ అయితే అది ఓ పెద్ద పండగ.. అదే పీరియడ్స్ వస్తే మాత్రం ఆ క్షణంలో గుండె ఆగిపోయినంత పనవుతుంది. న్యాచురల్‌గా ట్రై చేసినా, ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకున్నా ఈ ఆందోళన ఎవరికైనా ఒకటే. కానీ దీని గురించి ఎవరూ బయటికి మాట్లాడరు” అని ఆమె అన్నారు. అలాగే డెలివరీ తర్వాత వచ్చే ‘నాలుగో ట్రైమిస్టర్’ చాలా కీలకమని చెబుతూ.. “దయచేసి ఇలాంటి కష్టకాలంలో దంపతులు తమలో తాము కుమిలిపోకుండా, ఓ గదికే పరిమితం కాకుండా బయటకు వచ్చి వైద్యుల సహాయం తీసుకోండి. నా డాక్టర్లు, నా టీమ్ నాకు ఎంతో అండగా నిలిచారు. డెలివరీ తర్వాత (ఫోర్త్ ట్రైమిస్టర్) తల్లికి అందరి అండ చాలా అవసరం. ఆ సమయంలో ఆమెను కంటికి రెప్పలా కాపాడుకోండి” అంటూ ఉపాసన సమాజానికి, కుటుంబ సభ్యులకు ఓ బలమైన సందేశాన్ని ఇచ్చారు.
Also Read
- Bhogi Release Date: ఆగస్టు మిస్, నవంబర్ 12 మిస్.. ఫైనల్‌గా ‘భోగి’ దిగేది ఆ రోజేనట!
- Anirudh Ravichander: లైఫ్ ఇచ్చిన ధనుష్‌నే మర్చిపోయావా అనిరుధ్? 15 ఏళ్ల నోట్‌పై ఫ్యాన్స్ ఫైర్!
- Sita in Ramayana: సీత యోధురాలే.. ఆ సాక్ష్యంతో విమర్శకుల నోళ్లు మూయించిన డైరెక్టర్ నితీష్ తివారి..!
- Rashmika-Mysaa: కల్యాణి ప్రియదర్శన్ రికార్డుపై రష్మిక కన్ను.. ‘మైసా’తో చరిత్ర సృష్టిస్తుందా?
తాజావార్తలు
-
Upasana Konidela: పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్’తో నరకం చూశా
-
Rahul Gandhi: ‘నాన్న ఒడిలో అమ్మ కూర్చునేది’.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో రాజకీయ వివాదం..
-
Bhogi Release Date: ఆగస్టు మిస్, నవంబర్ 12 మిస్.. ఫైనల్‌గా ‘భోగి’ దిగేది ఆ రోజేనట!
-
Cyclone Akvan: అక్వాన్ తుఫాన్ ఎఫెక్ట్.. రేపటి నుంచి వీరికి సెలవులు రద్దు..
-
Kim Jong Un: ట్రంప్‌తో భేటీ వార్తలు.. స్టైల్‌గా సిగరెట్ తాగుతూ కిమ్ జోంగ్ ఉన్ ప్రత్యక్షం!
ట్రెండింగ్
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్‌ఫోన్..!
-
IPL 2027 రిటెన్షన్లకు నేడే చివరి గడువు.. ఇప్పటి వరకు జరిగిన ట్రేడ్స్ లిస్ట్ ఇదిగో..