Upasana : ఒక ఆడదాని కన్నీళ్లు ఇంకో ఆడదానికి విజయం కాకూడదు.. ఉపాసన సంచలన వ్యాఖ్యలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా కోడలు, అపోలో హాస్పిటల్స్ సీఎస్సార్ వైస్ చైర్పర్సన్ ఉపాసన కామినేని కొణిదెల మహిళలను ఉద్దేశించి చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. తమ ఎదుగుదల కోసం తోటి మహిళలను అణగదొక్కే వారికి, అలాగే చేతకాని మగాళ్ల (వీక్ మెన్) మెప్పు పొందేందుకు ఇతర మహిళలకు అన్యాయం చేసే ఆడవాళ్లకు ఆమె స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ‘ఫెస్టివల్ ఫర్ జాయ్స్’5వ వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉపాసన ఈ మేరకు పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చారు. మహిళా సాధికారత, తోటి వారికి సహాయం చేయడం గురించి మాట్లాడుతూ ఉపాసన పలు ఆసక్తికరమైన, ఘాటైన వ్యాఖ్యలు చేశారు. “సమాజంలో చాలా మంది మహిళలకు మన సహాయం అవసరం ఉంది. కానీ నా పరిశీలనలో నేను గమనించిన ఒక చేదు నిజం ఏంటంటే.. తమ సొంత ఎదుగుదల కోసం ఇతర మహిళలను తొక్కేసే ఆడవాళ్లు చాలా మంది ఉన్నారు. అలాంటి వారికి నేనిచ్చే వార్నింగ్ ఒక్కటే.. మీ సక్సెస్ కోసం లేదా ఒక ‘వీక్ మగాడి’ని సంతోషపెట్టడం కోసం వేరొక మహిళను అణగదొక్కొచ్చు అని అస్సలు అనుకోకండి” అంటూ ఉపాసన ఘాటుగా స్పందించారు.
ఒక ఆడదాని బాధ, ఇంకో ఆడదానికి ఎప్పటికీ విజయం కాకూడదన్న ఉపాసన.. మహిళలంతా కలిసికట్టుగా ఉంటేనే నిజమైన ఎదుగుదల సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. తోటి మహిళల పట్ల ఆడవాళ్ల మైండ్ సెట్ మారాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రముఖ సామాజిక కార్యకర్త సునీత కృష్ణన్ ఆధ్వర్యంలో ఉన్న చాలా మంది అభాగ్యులైన పిల్లల దుస్థితికి కారణం.. కొందరు స్వార్థపూరిత మహిళలు తమ సొంత ఆనందం కోసం ఇతర ఆడవాళ్లకు చేసిన అన్యాయమేనని ఉపాసన ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో మంచి మనసుతో ఇతరులకు నిస్వార్థంగా సహాయం చేసే మహిళల మధ్య తాను ఉండటం సంతోషంగా ఉందని ఆమె అన్నారు. ఇదే వేదికపై ప్రముఖ యాంకర్ సుమ కనకాలపై ఉపాసన ప్రశంసల వర్షం కురిపించారు. సుమ ఎంతో పవర్ఫుల్, కాన్ఫిడెంట్ మహిళ అని కొనియాడారు. “మనం ఎన్నో ఆడియో ఫంక్షన్లలో చూస్తుంటాం.. ఆ షోలను తన భుజాలపై వేసుకుని సుమ ఎలా సేవ్ చేస్తుందో అందరికీ తెలుసు. ఆమె మనందరికీ ఓ ఇన్స్పిరేషన్” అని ఉపాసన అన్నారు. అనంతరం, నిర్వాహకులు మాట్లాడుతూ.. విదేశీ పర్యటన నుంచి వచ్చిన వెంటనే, ఇంట్లో రామ్ చరణ్, పిల్లలు, పెంపుడు జంతువుల బాధ్యతలు చూసుకుంటూనే ఇంతటి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఉపాసనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వృద్ధాశ్రమాలు, మహిళా ఆశ్రమాల కోసం ఉపాసన చేస్తున్న సేవలు ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని వారు అభినందించారు.
Also Read
తాజావార్తలు
-
Upasana : ఒక ఆడదాని కన్నీళ్లు ఇంకో ఆడదానికి విజయం కాకూడదు.. ఉపాసన సంచలన వ్యాఖ్యలు!
-
Uttam Kumar Reddy : కాళేశ్వరం పునరుద్ధరణకు ఆర్మీ ఇంజనీర్.. బీఆర్ఎస్ తీరుపై మంత్రి ఉత్తమ్ ఫైర్
-
Adarsha Kutumbam : పేరేమో ఆదర్శ కుటుంబం.. కానీ చిన్న సినిమాలకు హారర్ కుటుంబం!
-
El Nino: ఎల్‌నినో రికార్డ్.. తొలిసారిగా 30°Cకు చేరిన ఉష్ణోగ్రతలు..
-
SS Rajamouli: గ్లోబల్ బాక్సాఫీస్‌పై జక్కన్న కన్ను.. ‘వారణాసి’ వరల్డ్‌వైడ్ థియేట్రికల్ !
ట్రెండింగ్
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!