Site icon NTV Telugu

Tollywood: ఒకే నిర్మాణ సంస్థ నుండి రెండు భారీ సినిమాలు..వారం గ్యాప్ లో విడుదల

Untitled Design (1)

Untitled Design (1)

టాలీవుడ్ లోని బిగ్ బ్యానర్స్ లో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఒకటి. టీజీ విశ్వప్రసాద్ మరియు వివేక్ కూచిబొట్ల ఈ సంస్థ అధినేతలు. అతి తక్కువ కాలంలో మిడ్ రేంజ్ బ్యానర్ నుండి భారీ చిత్రాలు నిర్మించే ప్రొడక్షన్ హౌస్ గా ఎదిగింది పీపుల్స్ మీడియా. కెరీర్ మొదట్లో ఒక రేంజ్ సినిమాలు నిర్మించిన ఈ సంస్థ అనంతి కాలంలోనే టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ‘బ్రో’ వంటి సినిమాలు నిర్మించే దిశగా ఎదిగింది.

ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ ఆగస్టు 15న విడుదలకు రెడీగా ఉంది. ఇటీవల కాలంలో రవితేజ తో వరుసగా మూడు సినిమాలు నిర్మించిన ఏకైక సంస్థ పీపుల్స్ మీడియా. మరోవైపు భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించే పనిలో ఉన్నారు నిర్మాతలు. ఈ నేపథ్యంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ” ది రాజాసాబ్”  చిత్రాన్ని భారీ స్థాయిలో తెరకెక్కిస్తోంది. హారర్ కామెడీ కథాంశంతో రానున్న ఈ చిత్రానికి మారుతీ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా విడుదలయిన ‘రాజాసాబ్’ గ్లిమ్స్ విశేష ఆదరణ పొందింది. కాగా చిత్రాన్ని 2025 ఏప్రిల్ 10న సమ్మర్ కానుకగా పాన్ ఇండియా భాషలలో వరల్డ్ వైడ్ గా విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు నిర్మాతలు. మరో వైపు ఇదే నిర్మాణ సంస్థ హనుమాన్ చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన తేజా సజ్జా హీరోగా ‘మిరాయ్’ అనే చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రాన్ని 2025 ఏప్రిల్ 18న విడుదల చేస్తోంది. కేవలం వారం రోజుల గ్యాప్ లో రెండు భారీ చిత్రాలను విడుదల చేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ.

Exit mobile version