NTV Telugu Site icon

Anchor Vishnu Priya: బుల్లితెర యాంకర్ ఇంట విషాదం.. రెస్ట్ ఇన్ పీస్ అమ్మా అంటూ..

Vishnu Priya

Vishnu Priya

Anchor Vishnu Priya: బుల్లితెర యాంకర్ విష్ణుప్రియ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తల్లి మృతిచెందారు. ఈ విషయాన్ని విష్ణు ప్రియ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా తన తల్లితో దిగిన ఫొటోను పంచుకుంటూ.. ‘నా ప్రియమైన అమ్మా.. ఈ రోజు వరకు నాతో ఉన్నందుకు ధన్యవాదాలు. నా చివరి శ్వాస వరకు నీ పేరు నిలబెట్టుకోవడానికి కృషి చేస్తాను. నువ్వే నా బలం.. నీవే నా బలహీనత. ఇప్పుడు మీరు ఈ అనంత విశ్వంలో కలిసిపోయారు. నా ప్రతి ఊపిరిలోనూ నువ్వు నాతోనే ఉంటావని నాకు తెలుసు. ఈ ప్రపంచంలో నాకు మంచి జీవితాన్ని ఇవ్వడానికి మీరు ఎన్ని కష్టాలు పడ్డారో నాకు తెలుసు. నా జీవితాంతం నీకు రుణపడి ఉంటాను. రెస్ట్ ఇన్ పీస్ అమ్మా…’ అంటూ విష్ణుప్రియ భావోద్వేగానికి లోనైంది.

Read also: Attack With Knife: ప్రేమను నిరాకరించిన యువతి.. కత్తితో కిరాతకంగా గొంతుకోసిన యువకుడు

అయితే.. ఈ వార్త తెలుసుకున్న బుల్లితెర నటీనటులు, యాంకర్లు దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తున్నారు. యాంకర్‌ విష్ణుప్రియ ఫ్యామిలీ పట్ల సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. విష్ణుప్రియ తల్లి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. అయితే.. ఒక యూట్యూబర్‌గా కెరీర్‌ ప్రారంభించిన విష్ణుప్రియ పోవే పోరా షోతో మంచి గుర్తింపు తెచ్చుకుంది విష్ణుప్రియ. ఈషోలో సుడిగాలి సుధీర్‌తో కలిసి ఆమె చేసిన హంగామానూ ఎవరూ మర్చిపోలేరు. అంతేకాకుండా.. పలు టీవీ షోలకు యాంకర్‌గా వ్యవహరిస్తూనే నటిగానూ బుల్లితెర ప్రేక్షకులకు బాగా చేరువైంది. అయితే.. ఇటీవల విడుదలైన వాంటెడ్ పండుగాడు సినిమాలోలో ఓ హీరోయిన్ గా నటించి ఆకట్టుకుంది.

Show comments