Trivikram : అందరి ముందే హీరోయిన్ శ్రీనిధి శెట్టి కాళ్లు మొక్కిన త్రివిక్రమ్!

Trivikram Srinidhishetty

Trivikram Srinidhishetty

టాలీవుడ్ ఇండస్ట్రీలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు ఉండే క్రేజ్, గౌరవం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే తాజాగా ఆయన చేసిన ఓ పని నెట్టింట సెన్సేషన్‌గా మారింది. ఏకంగా ఒక స్టార్ డైరెక్టర్ హోదాలో ఉండి, అందరి ముందే ఓ యువ హీరోయిన్ కాళ్లు మొక్కేందుకు ఆయన ప్రయత్నించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. విక్టరీ వెంకటేష్ హీరోగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఆదర్శ కుటుంబం’. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా అత్యంత ఘనంగా జరిగింది. అయితే ఈ వేడుకలో ఒక ఊహించని, ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. ఈవెంట్ జరుగుతున్న సమయంలో త్రివిక్రమ్ కూర్చున్న చోటకు వచ్చిన ఈ సినిమా హీరోయిన్ శ్రీనిధి శెట్టిని పలకరిస్తూనే ఉన్నట్టుండి సరదాగా ఆమె కాళ్లు మొక్కేందుకు త్రివిక్రమ్ కిందకు వంగారు.

త్రివిక్రమ్ సడన్‌గా అలా చేసేసరికి శ్రీనిధి శెట్టి ఒక్కసారిగా షాక్‌కు గురైంది. వెంటనే తేరుకుని, ఆయనను వారిస్తూ తానూ కిందకు వంగి ఆయన కాళ్ళకు నమస్కరించింది. ఆ తర్వాత ఇద్దరూ ఒకరికొకరు దణ్ణం పెట్టుకుంటూ మనస్ఫూర్తిగా నవ్వుకున్నారు. అనంతరం శ్రీనిధి అక్కడున్న వారందరినీ ఎంతో ఆత్మీయంగా పలకరిస్తూ సందడి చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఒక స్టార్ డైరెక్టర్ అయి ఉండి.. హీరోయిన్‌ను అంత సింపుల్‌గా, సరదాగా రిసీవ్ చేసుకున్న త్రివిక్రమ్ తీరును చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సినిమాలో శ్రీనిధి శెట్టి నటనకు మెచ్చి ఆయన ఆ రేంజ్‌లో అప్రిషియేట్ చేశారా? లేక కేవలం ఫన్ కోసం అలా చేశారా? అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా ‘ఆదర్శ కుటుంబం’ ఈవెంట్‌లో త్రివిక్రమ్ చేసిన ఈ పని మాత్రం సినిమాకు ఓ రేంజ్‌లో హైప్ తీసుకొచ్చింది.