Trivikram Srinivas: ‘ఆయన అంటే గౌరవంతో కూడిన ఇష్టంతో వచ్చిన భయం’ వెంకీ మామపై త్రివిక్రమ్ వైరల్ కామెంట్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trivikram Srinivas: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, విక్టరీ వెంకటేష్‌ల కాంబినేషన్ అంటే టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి ఎవర్గ్రీన్ క్లాసిక్స్‌తో తెలుగు సినీ చరిత్రలో చెరగని ముద్ర వేసిన ఈ ఇద్దరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఈ ఇద్దరి కాంబినేషన్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆదర్శ కుటుంబం’. ఈ చిత్రంలోని “నారాయణమ్మ” పాట విడుదల వేడుకలో డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎన్ని దశాబ్దాలు గడిచినా, ఎంతటి సాన్నిహిత్యం ఉన్నప్పటికీ వెంకటేష్ పక్కన ఉంటే తనకు ఇప్పటికీ లోలోపల ఒక విధమైన భయం ఉంటుందంటూ త్రివిక్రమ్ మనసులోని మాటను బయటపెట్టారు.
ఈ సందర్భంగా త్రివిక్రమ్ శ్రీనివాస్, తన సినీ ప్రస్థానం వెంకటేష్‌తో ఎలా ముడిపడి ఉందో గుర్తు చేసుకున్నారు. “నేను చిత్ర పరిశ్రమకు వచ్చిన కొత్తలో మొట్టమొదటిసారి పెన్ను పెట్టి డైలాగ్ రాసింది వెంకటేష్ గారి ‘పవిత్ర బంధం’ చిత్రానికే. నా సినీ జర్నీ ఆయనతోనే ప్రారంభమైంది. ఆ సమయంలో నేను ఎవరో కూడా ఆయనకు తెలియదు. కానీ ‘పెళ్లి చేసుకుందాం’ సినిమా సమయంలో ఎవరో కుర్రాడు చాలా బాగా రాస్తున్నాడంటూ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య గారితో వెంకీ సార్ ప్రస్తావించారు. ఆ తర్వాత ‘నువ్వు నాకు నచ్చావ్’ కథ చెప్పేందుకు కలిసినప్పుడే ఆయనతో నా మొదటి ప్రత్యక్ష పరిచయం ఏర్పడింది” అని వివరించారు. వెంకటేష్‌తో తనకున్న వ్యక్తిగత బంధం గురించి మాట్లాడుతూ త్రివిక్రమ్ చెప్పిన మాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. “వెంకటేష్ గారితో నాకు ఎంతో అనుబంధం ఉన్నప్పటికీ.. ఆయన దగ్గరకు వెళ్తే ఎందుకో నాకు ఇప్పటికీ కొద్దిగా భయం వేస్తుంది. బహుశా నా కెరీర్ ప్రారంభంలో ఆయన్ను ఒక అభిమానిగా దూరం నుంచి చూడటం వల్ల ఆ భావన అలాగే ఉండిపోయిందేమో. ఆయన నాతో ఎంత ఆప్యాయంగా, క్లోజ్‌గా మాట్లాడినా నా మనసులో ఆ గౌరవప్రదమైన దూరం అలాగే ఉంటుంది. నిజానికి అది భయం కాదు.. ఆయనపై ఉన్న గౌరవంతో కూడిన ఇష్టంతో వచ్చిన భయం” అంటూ తన భావోద్వేగాన్ని పంచుకున్నారు.
Also Read
- Karthi: "డీఎంకే అయినా.. టీవీకే అయినా ఇంతేనా?" విజయ్ సర్కార్‌ను నిలదీసిన హీరో కార్తి!
- Srikanth Odela: ‘నువ్వు సింగిల్ టేక్ ఆర్టిస్ట్‌వి బిడ్డా’.. ‘పారడైజ్’ వివాదాస్పద సీన్‌పై శ్రీకాంత్ ఓదెల ఓపెన్ క్లారిటీ!
- OTT Release: ఓటీటీలోకి రూ.325 కోట్ల మలయాళ బ్లాక్‌బస్టర్.. ఎప్పుడు? ఏ ప్లాట్ఫామ్లో చూడొచ్చంటే?
- Srikanth Odela: ‘మగధీర’లో గుర్రానికి లేని లాజిక్.. 'ది ప్యారడైజ్'లో కుక్కకు వచ్చిందా? ట్రోలర్లకు ఇచ్చిపడేసిన శ్రీకాంత్!
వెంకటేష్ వర్క్ ఎథిక్స్ గురించి త్రివిక్రమ్ ప్రశంసల వర్షం కురిపించారు. దాదాపు 76 చిత్రాలు పూర్తి చేసుకున్న తర్వాత కూడా సినిమా పట్ల ఆయనకు ఉండే తపన, క్రమశిక్షణ అమోఘమని కొనియాడారు. అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ, సినిమా డెడ్‌లైన్స్‌కు ఎలాంటి ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో నిన్నటి వరకు డబ్బింగ్ పూర్తి చేశారని తెలిపారు. అలాగే ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ రాసిన ‘ఆనందో బ్రహ్మ’ నవలలోని ముగింపు వాక్యాన్ని ఉటంకిస్తూ.. “వయసు ఏమాత్రం ప్రభావం చూపించని వ్యక్తులు కొందరు ఉంటారు.. వారిలో వెంకటేష్ గారు మొదటి వరుసలో ఉంటారు” అని కితాబిచ్చారు. ‘నువ్వు నాకు నచ్చావ్’ సమయం నుంచి ఇప్పటి వరకు ఆయనలో ఎలాంటి మార్పూ రాలేదని, ఆయన ఎనర్జీ నిత్య నూతనమని స్పష్టం చేశారు. అక్టోబర్ 9న థియేటర్లలో విడుదల కానున్న ‘ఆదర్శ కుటుంబం’ చిత్రం ప్రతి ఒక్కరినీ అలరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Trivikram Srinivas: ‘ఆయన అంటే గౌరవంతో కూడిన ఇష్టంతో వచ్చిన భయం’ వెంకీ మామపై త్రివిక్రమ్ వైరల్ కామెంట్స్!
-
LNG Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. దేశంలో తొలి LNG రైలుకు గ్రీన్ సిగ్నల్..
-
Bank Strike: సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల బ్యాంక్ సమ్మె.. కారణం ఇదే
-
Karthi: “డీఎంకే అయినా.. టీవీకే అయినా ఇంతేనా?” విజయ్ సర్కార్‌ను నిలదీసిన హీరో కార్తి!
-
KPHB: హైదరాబాద్‌లో చీటీల పేరిట రూ.16 కోట్ల కుచ్చుటోపీ
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?