God of War: అసలు కుమారస్వామి ఎక్కడ పుట్టాడు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కుమారస్వామి జీవిత చరిత్ర ఆధారంగా త్రివిక్రమ్ మైథలాజికల్ సోషియో ఫ్యాంటసీ కథను రాసుకుని సినిమాను ప్రకటిస్తూ ఆ మధ్య ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ‘బోర్న్ ఇన్ ద నార్త్, ఫోర్జ్ ఇన్ ద హార్ట్ లాండ్, వర్షిప్డ్ ఇన్ ద సౌత్’ అనే టాగ్లైన్ ఉంచారు. సుబ్రహ్మణ్య స్వామి నార్త్‌లో పుట్టాడని దర్శకుడు చెప్పడం తంబీలకు నచ్చలేదు. గాడ్ ఆఫ్ వార్ తమిళనాడులో పుడితే, నార్త్‌లో పుట్టారంటూ దర్శకుడు చరిత్రను వక్రీకరించారని తంబీలు మండిపడుతున్నారు. గాడ్ ఆఫ్ వార్ ఇష్యూ రాజకీయ రంగు పులుముకుంది. తమిళ మనోభావాలు దెబ్బతీసేలా క్యాప్షన్ ఉందంటూ రాజకీయ నాయకులు విమర్శిస్తున్నారు. ఎన్టీకే అధినేత సీమన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళ దేవుడి పుట్టుక గురించి తప్పుడు ప్రచారం చేస్తే సినిమాను అడ్డుకుంటామని హెచ్చరించారు.
కుమారస్వామి పుట్టిన ప్రదేశం గురించి సోషల్ మీడియాలో రెండు వర్గాల పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి. హిందూ పురాణంలో కుమారస్వామి హిమాలయాల్లో జన్మించారని సినిమా టీంకు మద్దతుగా కొందరు నిలుస్తున్నారు. గురూజీ కలం పట్టి ఏ ముహూర్తాన ఈ కథను రాసుకున్నాడో గాని, అన్ని అడ్డంకులే! ముందుగా ఈ కథను బన్నీకి వినిపించాడు. పుష్ప 2 రిలీజ్ కాకుండానే ఈ ప్రాజెక్ట్ ప్రకటించారు కానీ ఏమైందో ఏమో అల్లు అర్జున్ మాత్రం అట్లీ డైరెక్షన్లో ‘రాకా’కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇదే కథను ఎన్టీఆర్‌తో ప్రకటించాడు త్రివిక్రమ్. సినిమాను అనౌన్స్ చేశారో లేదో వివాదం మొదలైంది. ఇది రాజకీయ, సాంస్కృతిక చర్చకు దారితీస్తోంది.
Also Read
- Nayanthara: స్టార్ హీరోయిన్లో సడెన్ ఛేంజ్.. ఫస్ట్ టైమ్ ఇలా!
- Operation Ganga: మోహన్‌లాల్ కొత్త సినిమాకు టైటిల్ ఫిక్స్.. భారీ తారాగణంతో రాబోతున్న 'ఆపరేషన్ గంగా'
- Toxic English Version: యష్ ‘టాక్సిక్’కు మరో షాక్.. ఇంగ్లీష్ వెర్షన్‌కు సౌండ్ నిల్..
- Hanuman Ansh Singer: ఒక్క పాటతో అంధ గాయకుడి లైఫ్ టర్న్.. బాలీవుడ్ నుంచి వరుస ఆఫర్లు..
వివాదంపై ఇప్పటివరకు అయితే ఎలాంటి అధికారిక స్పష్టత రాలేదు. పోస్టర్లో కుమారస్వామి పుట్టిన ప్రదేశం గురించి రాయడంతో రచ్చ మొదలైంది. ఇదే విషయాన్ని సినిమాలో చూపిస్తే తంబీల మనోభావాలు దెబ్బతినడం ఖాయం, సినిమా రిలీజ్‌ను అడ్డుకుంటారు. పుట్టిన ప్రదేశం ప్రస్తావన కథలో లేకుండా జాగ్రత్త పడితే సరిపోతుందన్న ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. ఎన్టీఆర్ ప్రస్తుతం ‘డ్రాగన్’తో బిజీగా ఉన్నాడు. దాదాపు ఇంకో 10 నెలల పాటు ఇదే సినిమాతో జర్నీ చేస్తాడు. ఎప్పుడో మొదలై రెండేళ్ల తర్వాత రిలీజ్ అయ్యే మూవీ గురించి ఇప్పుడే స్పందిస్తారో లేదో చూడాలి మరి.
తాజావార్తలు
-
KTR: ‘జాబులు లేవు.. జవాబులు లేవు’.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు
-
Pretorius Breaks T20 Record: వైభవ్ సూర్యవంశీ సహచరుడి చరిత్రాత్మక శతకం.. అరుదైన రికార్డు సొంతం
-
Nayanthara: స్టార్ హీరోయిన్లో సడెన్ ఛేంజ్.. ఫస్ట్ టైమ్ ఇలా!
-
Teachers Day Special: ద్రోణాచార్యుడి నుంచి వశిష్ఠుడి వరకు.. దేవతలు సైతం తలవంచిన 10 మంది మహా గురువులు వీరే!
-
Operation Ganga: మోహన్‌లాల్ కొత్త సినిమాకు టైటిల్ ఫిక్స్.. భారీ తారాగణంతో రాబోతున్న ‘ఆపరేషన్ గంగా’
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!