Site icon NTV Telugu

పెళ్ళి వార్తలపై క్లారిటీ ఇచ్చేసిన త్రిష

Trisha Krishnan Team Gives Clarity on her Marriage Rumours

పాపులర్ సౌత్ ఇండియా హీరోయిన్ త్రిష కృష్ణన్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమెను అభిమానులు సౌత్ క్వీన్ అని పిలుస్తారు. అయితే గత కొన్ని రోజులుగా త్రిష పెళ్ళికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ విషయంపై క్లారిటీ వచ్చేసింది. కొన్ని వారాల క్రితం త్రిష కృష్ణన్ ధనవంతుడైన చెన్నైకి చెందిన వ్యాపారవేత్తతో ఏడడుగులు వేయనున్నట్టు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. త్రిష కృష్ణన్ అవన్నీ రూమర్స్ అని కొట్టి పారేస్తూ పెళ్లి వార్తలపై వస్తున్న వార్తలు అబద్ధమని వెల్లడించారు.

Read Also : “మా” కాంట్రవర్సీ… రంగంలోకి కృష్ణంరాజు

అంతకుముందు త్రిష పుట్టినరోజు సందర్భంగా ప్రముఖ నటి చార్మ్ కౌర్ త్రిష పెళ్లి గురించి ఒక సూచన ఇచ్చింది. ఇది బ్రహ్మచారిగా త్రిషకు చివరి పుట్టినరోజు అవుతుందని ఆమె చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది. కానీ త్రిష నుంచి స్పందన రాలేదు. ఇక త్రిష ప్రముఖ నటులతో పలు విజయవంతమైన చిత్రాలలో నటించింది. ప్రస్తుతం ఆమె మణిరత్నంతో కలిసి “పొన్నియన్ సెల్వన్”లో కీలకమైన పాత్రలో కనిపించనుంది.

Exit mobile version