NTV Telugu Site icon

Trisha : 40 ప్లస్‌లో సత్తా చాటుతున్న ‘త్రిష’

Sweety (3)

Sweety (3)

ఎంత స్టార్ హీరోయిన్ కైనా  సినీ కెరీర్ లో ఒకసారి డౌన్ ఫాల్ స్టార్ట్ అయితే మళ్లీ బౌన్స్ బ్యాక్ అవడం చాలా కష్టం. కానీ త్రిష విషయంలో సీన్ రివర్స్. ఇరవై ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా కంటిన్యూ అవుతూ.. 40 ఏళ్ల వయస్సులో కూడా వరుస ప్రాజెక్టులతో  కుర్ర హీరోయిన్స్ కు సవాల్ విసురుతోంది.  కెరీర్ పీక్స్‌లో ఉండగా బిజినెస్ మ్యాన్ వరుణ్‌తో ఎంగేజ్ మెంట్  క్యాన్సిల్ తర్వాత  సినిమా ఛాన్స్ లు తగ్గాయి. లేడీ ఓరియెంట్స్ చిత్రాలు చేస్తే బెడిసికొట్టాయి. ఇక త్రిష పని అయిపోయిందని అనుకున్నారు.

Also Read : Dulquer Salmaan : అరుదైన ఘనత సాధించిన ‘లక్కీ భాస్కర్’

కానీ 96 తో సౌత్ క్వీన్ త్రిష సెకండ్ ఇన్నింగ్స్ బ్లాక్ బస్టర్ గా స్టార్ట్ చేసింది.  పొన్నియన్ సెల్వన్‌లో కుందవల్లిగా 35 ప్లస్‌లో కూడా ఇంత అందంగా ఉందేంట్రా  అనేలా మెప్పించింది.  త్రిష కంబ్యాక్  వరుసగా తమిళంలో స్టార్ హీరోలతో వన్ టైం కాదు.. బ్యాక్ టు బ్యాక్ వర్క్ చేస్తోంది. లియోలో ఇళయదళపతి విజయ్‌తో కనిపించి.. ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైంలో ఓ పాటలో అతడితో కలిసి స్టెప్స్ వేసింది. వన్ ఆఫ్ ది హిట్ పెయిర్‌గా అజిత్ అండ్ త్రిష జంటకు క్రేజ్. ఈ క్రేజీ కాంబో విదాముయర్చితో పాటు గుడ్ బ్యాడ్ అగ్లీతో అజిత్‌తో రొమాన్స్ చేస్తోంది. ఇవే కాదు తెలుగు, మలయాళ సినిమాలతో ఫుల్ బిజీ లైఫ్ లీడ్ చేస్తోంది భామ. స్టాలిన్ తర్వాత చిరంజీవితో విశ్వంభరలో యాక్ట్ చేస్తుంటే.. ఆరేళ్ల గ్యాప్ తీసుకుని మాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. మాలీవుడ్ స్టార్ హీరో మోహన్ లాల్‌తో రామ్, టొవినో థామస్‌తో ఐడెంటిటీకి కమిటయ్యింది. ఆరు తర్వాత గ్యాప్ ఇచ్చి సూర్యతో మరో మూవీ డిస్కషన్స్ లో ఉంది.

Show comments