నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నూతన దర్శకుడు వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బింబిసార. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై హరికృష్ణ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సోషియో ఫాంటసీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆగస్టు 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్ , సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. రిలీజ్ డేట్ దగ్గరపడడంతో ప్రమోషన్స్ పెంచేసిన చిత్ర బృందం నిన్న 29న శిల్పకళా వేదికలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించింది. ఇక ఈ ఈవెంట్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా విచ్చేసారు. ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా వస్తున్నాడు అని తెలియడంతో నందమూరి ఫ్యాన్స్ ఉత్సాహంతో పరుగులు పెట్టారు. బయట వర్షాన్ని కూడా లెక్కచేయకుండా నందమూరి అభిమానులు శిల్పా కళావేదికకు చేరుకున్నారు.
read also:Revanth Reddy: కేసీఆర్.. భోజనానికి ముందు ఆత్మపరిశీలన చేసుకో
అయితే.. బింబిసారా ప్రీ ఈవెంట్ లో విషాదం చోటు చేసుకుంది. నందమూరిని చూసేందుకు వచ్చిన ఓ అభిమాని అనుమాస్పద మృతి చెందాడు. ఈవార్త కాస్త చర్చకు దారితీసింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ వచ్చిన అభిమాని ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాడు? అనే ఆరా తీసే పనిలోపడ్డాడు. పుట్టా సాయి రామ్ అనే వ్యక్తి నందమూరికి వీరాభిమాని ఆయన్ను చూసేందుకు వానను కూడా లెక్కచేయకుండా అక్కడకు చేరుకున్నాడు. అయితే అక్కడ ఏం జరిగిందో ఏమో కానీ.. పుట్టా సాయి రామ్ అనుమాన్సద మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృత దేహాన్ని పోస్టుమార్టన్ నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పుట్టా సాయిరామ్ ఆంధ్రప్రదేశ్ తాడేపల్లి గూడెం కు చెందిన వాడిగా గుర్తించారు. కూకట్పల్లి లో వుంటూ ప్రవేట్ జాబ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే అభిమానుల మధ్య తోపులాట జరిగిందా.. లేదా అక్కడున్న అభిమానులతో గొడవ జరిగిందా అనే కోణంలో పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Club Masti Pub: మళ్లీ తెరపైకి క్లబ్ మస్తీ.. యువతులతో అశ్లీల దందా..