టాలీవుడ్ కార్మిక సంఘాలు సమ్మె సైరన్ మోగించాయి. రోజు వారి వేతనాలు 30% వరకు పెంచమనడంతో అందుకు ఫిలిం ఛాంబర్ ఒప్పుకోకపోవడంతో నేటి నుండి ఫిలిం ఫెడరేషన్ సంఘాలు షూటింగ్స్ చేయకుండా బంద్ కు పిలుపునిచ్చాయి. దాంతో టాలీవుడ్ లో మీడియం చిన్న సినిమాల షూటింగ్స్ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కానీ బడా నిర్మాణా సంస్థలు మాత్రమే షూటింగ్స్ ను ఆపేది లేదని ఎవరిని లెక్క చేయకుండా షూటింగ్స్ చేస్తున్నాయి.
Also Read : Kantara : కాంతారా 3 లో జూనియర్ ఎన్టీఆర్?
టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థలో ఒకటైన మైత్రీ మూవీస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ చేస్తోంది. సీనియర్ నటీనటుల కాంబినేషన్ లో సీన్స్ ఉండడంతో షూటింగ్ ఆపితే ఎక్కువ నష్టం వస్తుందని భావించి షూటింగ్ చేస్తోంది. వేతనాలు పెంపు కొరకు తెలుగు సినిమా కార్మికులు నేటి నుంచి బంద్ కు పిలుపునివ్వడంతో చేసేదేమి లేక ముంబయి నుండి కార్మికులను తెప్పించి మరి షూటింగ్ నిర్వహిస్తోంది మైత్రి సంస్థ. అన్నపూర్ణ స్టూడియో లో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ జరుగుతోంది. ముంబై నుండి కార్మికులు వచ్చారని తెలుసుకున్న యూనియన్ ప్రతినిధులు పవన్ కళ్యాణ్ షూటింగ్ ను అడ్డుకోవడానికి వెళ్లాయి. దానితో అక్కడ ఇరువురి మధ్య వాదనలు చెలరేగాయి. కార్మికులు ఒక వైపు బంద్ చేస్తుంటే ముంబయి నుండి వర్కర్స్ ను ఎలా తీసుకువస్తారు, మన కార్మికులు కష్టం హీరో పవన్ కళ్యాణ్ గారికి తెలియదా అని పవన్ కళ్యాణ్, మైత్రి సంస్థ పై మండి పడుతున్నాయి సినీ కార్మిక సంఘాలు.