కేజీయఫ్ స్టార్ యశ్ హీరోగా, మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘టాక్సిక్’. ‘ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ చిత్రం నుండి లేడీ సూపర్ స్టార్ నయనతార ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో ఆమె ‘గంగ’ అనే పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. కానీ ఆ పేరుకు ఏమాత్రం మోడ్రన్ డ్రెస్ ధరించి, చేతిలో గన్ పట్టుకుని సీరియస్ లుక్స్‌తో ఉన్న నయనతార పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read : Raja Saab: ప్రభాస్ లాంటి కొడుకు పుట్టాలి – జరీనా వహాబ్
ఈ సినిమాలో ముగ్గురు కథానాయికలు ఉండబోతున్నారనే ప్రచారాన్ని నిజం చేస్తూ మేకర్స్ వరుసగా అప్‌డేట్స్ ఇస్తున్నారు. నయనతారతో పాటు కియారా అద్వానీ ‘నదియా’ పాత్రలో, హ్యుమా ఖురేషీ ‘ఎలిజబెత్’ పాత్రలో నటిస్తున్నట్లు టీమ్ ప్రకటించింది. ముగ్గురు స్టార్ హీరోయిన్లు ఒకే సినిమాలో కనిపిస్తుండటంతో సినిమా రేంజ్ మరింత పెరిగింది. యశ్ తన 19వ చిత్రంగా నటిస్తున్న ఈ మూవీ పెద్దలకు సందేశమిచ్చేలా ఉంటుందని సమాచారం. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.
