ToxicTheMovie : ‘టాక్సిక్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ప్రమాదం: సౌండ్ బాక్స్‌లు కూలి విద్యార్థులకు గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్-ఇండియా స్టార్ యష్ కథానాయకుడిగా వస్తున్న భారీ చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ . మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 26న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో జెట్ స్పీడ్ లో చేస్తున్నాడు యష్. మేడ్చల్ జిల్లాలోని మల్లారెడ్డి యూనివర్సిటీ ప్రాంగణంలో శనివారం రాత్రి ఈ ఈవెంట్‌ను వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యశ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు వేలాది మంది విద్యార్థులు, అభిమానులు భారీగా తరలివచ్చారు.
దాంతో ప్రీ-రిలీజ్ వేడుకలో ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. కార్యక్రమం జరుగుతుండగా, హీరో యశ్‌ను చూసేందుకు కొందరు ఉత్సాహంతో వేదిక సమీపంలో అమర్చిన భారీ సౌండ్ బాక్స్‌లు, ఫ్లడ్ లైట్ నిర్మాణాలపైకి ఎక్కారు. విద్యార్థుల బరువును తట్టుకోలేక ఆ సౌండ్ సిస్టమ్ అమర్చిన ఫ్రేమ్ అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. ఈ ఘటనతో అక్కడ ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థుల కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు వేగంగా స్పందించి, గాయపడిన విద్యార్థులను అంబులెన్స్‌లలో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. బాధితులకు ప్రస్తుతం అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ప్రాంగణంలో భద్రతా చర్యలు సరిగా లేకపోవడం, విద్యార్థులు పరిమితికి మించి సౌండ్ బాక్సులపైకి ఎక్కడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రమాదం జరగడంతో హీరో యష్ తన స్పీచ్ ను ఆపేసి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించమని సూచించారు.
Also Read
- Taapsee vs Kangana: ‘పెంపకం’ వ్యాఖ్యలతో మళ్లీ రాజుకున్న కంగనా-తాప్సీ వార్.. ఇన్‌స్టాలో ఫైర్ బ్రాండ్ కౌంటర్!
- Jason Sanjay: విజయ్ బాటలో జాసన్ సంజయ్.. నటుడిగా ఎంట్రీపై ఫస్ట్ టైమ్ క్లారిటీ!
- Zombie Reddy 2: తేజ సజ్జ బర్త్‌డేకు ‘జోంబీ రెడ్డి 2’ బిగ్ సర్ప్రైజ్.. ప్రశాంత్ వర్మ హిట్‌కు సీక్వెల్ రెడీ!
- Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
తాజావార్తలు
-
ToxicTheMovie : ‘టాక్సిక్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ప్రమాదం: సౌండ్ బాక్స్‌లు కూలి విద్యార్థులకు గాయాలు
-
Taapsee vs Kangana: ‘పెంపకం’ వ్యాఖ్యలతో మళ్లీ రాజుకున్న కంగనా-తాప్సీ వార్.. ఇన్‌స్టాలో ఫైర్ బ్రాండ్ కౌంటర్!
-
Onion Price Hike: కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి ధరలు.. కిలో రూ.70 వరకు విక్రయం!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Japan Earthquake: జపాన్‌లో 5.9 తీవ్రతతో భూకంపం.. 20 మందికి గాయాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!