NTV Telugu Site icon

Toxic : ఆ ప్రయాణం ఎప్పటికీ మర్చిపోలేను

Yash (2)

Yash (2)

రాకింగ్ స్టార్ యష్ ఒకె ఒక్క మూవీ ‘కేజీఎఫ్’తో పాన్ ఇండియా రేంజ్‌లో క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అతని మాస్‌లుక్‌, యాక్షన్‌తో యష్‌ అన్ని భాషల నుండి అభిమానులకు సంపాదించుకున్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రెండు భాగాలుగా వచ్చి సంచలన విజయం సాధించింది. దంతో యష్ తదుపరి చిత్రం కోసం ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. కాగా ప్రజంట్ గీతూ మోహన్‌దాస్ హెల్మ్ చేసిన ‘టాక్సిక్’ అనే గ్యాంగ్‌స్టర్ డ్రామాలో తదుపరి పాత్రలో కనిపించనున్నాడు యష్. భారీ అంచనాలున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుండగా, నయనతార, హుమా ఖురేషి మరియు తారా సుతారియా ప్రముఖ పాత్రల్లో నటించారు. అయితే ఈ మూవీలో అమెరికన్ నటుడు కైల్ పాల్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా పాల్ తన సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ ఈ మూవీ గురించి తన అనుభవాలను పంచుకున్నాడు.

‘ఈ సినిమా ప్రయాణం నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే గొప్ప అనుభూతి. నేను ఇప్పటి వరకు నటించిన సినిమాలతో పోల్చితే ‘టాక్సిస్’ ప్రయాణం బెస్ట్ ఎక్స్‌పిరియన్స్ అని చెడుతాను. ఇండియాలో టాక్సిక్ సినిమా షూటింగ్ స‌మ‌యంలో ఓ అనుభ‌వాన్ని పొందాను. ఆరోజు ఉద‌యం మూడు గంట‌ల‌కు షూటింగ్ చేస్తున్నాం. అదొక భావోద్వేగ స‌న్నివేశం. అలాంటి సన్నివేశంలో నేను క‌న్నడ‌లో మాట్లాడాలి. ఆ డైలాగ్‌లు ఆలోచిస్తూ భావోద్వేగంలో ఉండాలి. కానీ నేను తార్కికంగా ఆలోచించ‌లేక‌పోయాను. కాబ‌ట్టి భావోద్వేగాన్ని గొప్పగా స‌న్నివేశంలో ప‌లికించ‌లేక‌పోయాను’ అని తెలిపారు పాల్.