Site icon NTV Telugu

Toxic : పాన్ వరల్డ్ లాంగ్వేజెస్ లో టాక్సిక్.. హాలీవుడ్ వుడ్ పై కన్నేసిన యష్

Toxic

Toxic

కెజీయఫ్ సిరిస్ తో పాన్ ఇండియా స్థాయిలో ఫ్యాన్స్ తో పాటు మార్కెట్ ను పెంచుకున్నాడు యష్. ఒకే ఒక్క సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన కన్నడ స్టార్ హీరో యష్ నెక్స్ట్ సినిమా ఎలా ఉండబోతోందనే ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూసారు. కెజీయఫ్ 2 తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని ‘టాక్సిక్’ అనే సినిమా అనౌన్స్ చేశాడు యష్. గీతూ మోహన్‌దాస్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ‘ఏ ఫెయిరీ టేల్‌ ఫర్‌ గ్రోన్‌ అప్స్‌’ అనే ట్యాగ్‌ లైన్‌తో ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్స్ సినిమాపై బజ్ ను పెంచాయి.

Also Read : Nithiin : అరడజనుకుపైగా ప్లాపులు.. రిలీజ్ కు రెడీగా మరో సినిమా

కాగా ఆ మధ్య యష్ పుట్టిన రోజు కానుకగా వచ్చిన ఫస్ట్ గ్లిమ్స్ సినిమాపై బజ్ ను అమాంతం పెంచేసాయి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ బజ్ కన్నడ మీడియా సిర్కిల్స్ లో వినిపిస్తోంది. టాక్సిక్ సినిమాను పాన్ ఇండియా లాంగ్వేజెస్ తో పాటు ఇంగ్లీష్ లో కూడా ఒకేసారి షూట్ చేస్తున్నారట. ఇండియాతో పాటు హాలీవుడ్ లోను ఈ సినిమాను ఒకేసారి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. వాస్తవానికి ఈ ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ అని షూటింగ్ మొదలైనపుడు ప్రకటించిన మేకర్స్ అనుకోని కారణాల వలన విడుదల వాయిదా వేశారు. లేటెస్ట్ గా ఈ సినిమాను 2026 మార్చి 19 విడుదల చేస్తామని ప్రకటించారు. KGF తర్వాత లాంగ్ గ్యాప్ తో వస్తున్న టాక్సిక్ పై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.

 

Exit mobile version