Site icon NTV Telugu

Tourist Family: నాణానికి మరో కోణం.. భయంకరం!

Tourist Family Review

Tourist Family Review

ఈ మధ్యకాలంలో తమిళ సినీ పరిశ్రమ నుంచి వచ్చి హిట్ అందుకున్న సినిమాలలో టూరిస్ట్ ఫ్యామిలీ ఒకటి. శశికుమార్ హీరోగా నటించిన ఈ సినిమాలో సిమ్రాన్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి మంచి ప్రశంసలు అందుకుంటోంది. ఏకంగా రాజమౌళి లాంటి వాళ్లే సినిమా బావుంది అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ఇక థియేటర్లలో మంచి వసూళ్లు రాబట్టిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో కూడా అందరి ప్రశంసలు దక్కించుకుంటోంది.

Also Read:Kannapa Trailer : కన్నప్ప ట్రైలర్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?

అయితే నాణ్యతకు మరోపక్క అంటూ ఇప్పుడు కొంతమంది ఈ సినిమా మీద విష ప్రచారం మొదలుపెట్టారు. అది వారి ప్రకారం సరైన ప్రచారమే కానీ, సినిమా నచ్చిన వారు మాత్రం అది విష ప్రచారం అంటున్నారు. అసలు విషయం ఏమిటంటే, శ్రీలంక అల్లర్ల నేపథ్యంలో అక్కడి కుటుంబం తమిళనాడుకు షిఫ్ట్ అవుతుంది. అలా షిఫ్ట్ అయిన కుటుంబం ఎలా ఇండియన్ తమిళనాడు సమాజంలో సెట్ అయింది అనే నేపథ్యంలో ఈ సినిమా రూపొందించబడింది.

Also Read:Kannappa : మంచు విష్ణు ఓవర్ హైప్.. బెడిసికొడుతుందా..?

మానవ బంధాలు, ఎమోషన్స్ ప్రధానంగా ఈ సినిమా సాగుతుంది. అయితే ఒక వర్గం వారు మాత్రం ఇందులో ఇల్లీగల్‌గా దేశంలో ఎంటర్ అయిన విధానాన్ని, వారు ఎంటర్ అవడం మాత్రమే కాదు, ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు పుట్టించిన విధానం, ఒక కాలనీలో కలిసిపోయిన విధానం అంతా గ్లోరిఫై చేసేలా ఉందని, ఇది ఏమాత్రం కరెక్ట్ కాదని అంటున్నారు. ఒక భయంకరమైన ఇష్యూని హ్యూమన్ ఎమోషన్స్ ఉన్న సినిమాగా తీసుకురావడం ఏమాత్రం కరెక్ట్ కాదని వారు ఆక్షేపిస్తున్నారు. ఇందులో మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి.

Exit mobile version