NTV Telugu Site icon

Tollywood : పొంగల్‌కు వచ్చిన ప్రతిసారి హిట్టు కొట్టిన బడా నిర్మాత

Dilraju

Dilraju

డిస్ట్రిబ్యూటర్ నుండి నిర్మాతగా మారిన వెంకటరమణా రెడ్డి అలియాస్ దిల్ రాజు టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్. ఫిల్మ్ మేకర్‌గా మారిన తర్వాత కూడా అచ్చొచ్చిన డిస్ట్రిబ్యూషన్ వదల్లేదు. ఈ సంక్రాంతికి మూడు హిట్లను చూసిన ఈ స్టార్ ప్రొడ్యూసర్ ఇప్పుటి వరకు ఓ పొంగల్‌లోనూ ఓడిపోలేదు. 2013లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుతో స్టార్టైన హిట్ సెంటిమెంట్ ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నాడు. అప్పటి నుండి వీలు చిక్కినప్పుడల్లా పొంగల్‌కు సినిమాను తీసుకువచ్చి సక్సీడ్ అవుతున్నాడు.

Also Read : AlluArjun : బన్నీ, త్రివిక్రమ్ సినిమాకు అంతా రెడీ..

2014 సంక్రాంతి బరిలో దిగిన మల్టీ స్టారర్ ఎవడు కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ ఏడాది హయ్యెస్ట్ గ్రాసర్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. 2017లో మరో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ శతమానం భవతిని తీసుకు వచ్చి డీసెంట్ హిట్ అందుకున్నాడు దిల్ రాజు. 2019లో ఎఫ్ 2ని దింపి మరో బ్లాక్ బస్టర్ హిట్టును తన ఖాతాలో వేసుకున్నాడు. పెద్దోడితో హిట్టు కొట్టాక చిన్నోడు మహేష్‌తో సరిలేరు నీకెవ్వరు తీసి అప్పటి వరకు చూడని కలెక్షన్లు చూశాడు దిల్ రాజు. టాలీవుడ్‌లో సక్సెస్ రేష్యో మెయిన్ టైన్ చేస్తున్న దిల్ రాజు  2022 పెద్దల పండుగకు రౌడీ బాయ్స్ తీసుకు వచ్చాడు.  ఇదొక్కటే సంక్రాంతి రేసులోకి వచ్చి యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఏకైక  సినిమా. 2023లో ఇళయదళపతి విజయ్‌తో వారిసును పొంగల్ రేసులో దింపి తెరంగేట్రంలోనే అదరగొట్టేశాడు. 2025 సంక్రాంతికి దిల్ రాజు బ్యానర్‍లో గేమ్ ఛేంజర్, సంక్రాంతి వస్తున్నాం నిర్మాతగా డాకు మహారాజ్ నైజాం హక్కులను తీసుకుని డిస్ట్రిబ్యూటర్‌గా కూడా ఈ ఫెస్టివల్‌కు త్రిబుల్ ధమాకాను ఎంజాయ్ చేశాడు. అందులోనూ సంక్రాంతికి వస్తున్నాం ఊహించిన విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు స్టార్ ప్రొడ్యూసర్. అలా దిల్ రాజు సంక్రాంతి రియల్ హీరోగా మారారు.