Tollywood New Trend: మమ్మల్ని మేమే చెక్కుకుంటాం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గతంలో హీరోలు తమని తాము నిలబెట్టుకోవడానికి నిర్మాతలుగా మారి, తమని తాము ప్రమోట్ చేసుకున్నారు. ఇలా హీరోస్ అందరికీ సొంత బ్యానర్స్ వచ్చేసాయి. కానీ ఇప్పటి యంగ్ హీరోస్ అలా కాదు; నిర్మాతగా మారడంతో పాటు ఏకంగా మెగాఫోనే పట్టేస్తున్నారు. కథ విన్నామా, నచ్చిందా, షూటింగ్ పూర్తి చేసేసామా అన్నట్లు స్టార్స్ ఉంటారు. కథ వినేటప్పుడే ఒకటికి 10 సార్లు ఆలోచిస్తారే కానీ, మెగాఫోన్ కి దూరంగా ఉంటారు. కానీ యంగ్ హీరోలు అలా కాదు; కథలో, స్క్రిప్ట్ లో, డైరెక్షన్లో టాలెంట్ చూపిస్తున్నారు.
ఎవరి కెరీర్ లో అయినా ఫ్లాప్‌లు, హిట్స్ కామనే, కింద పడినా లేచి నిలబడతారు. కానీ రామ్ పోతినేని మాత్రం హిట్ తో ఫామ్ లోకి రాలేకపోతున్నాడు. ఏ సినిమా చేసినా ఫ్లాప్ే అన్న ముద్ర పడింది. ఇస్మార్ట్ శంకర్ హిట్ తర్వాత రామ్ సక్సెస్ చూడలేదు. రెడ్, వారియర్, స్కంద, డబుల్ ఇస్మార్ట్, ఆంధ్ర కింగ్ తాలూకా వరకు ఫ్లాప్‌లు క్యూ కట్టాయి. ఎవరిని నమ్ముకున్నా హిట్ ఇవ్వలేకపోతున్నారు. ఇలా ఎన్ని సార్లు నమ్మాలన్నా భయం, మెగాఫోన్ పట్టడానికి కారణమైంది. తనకు తానే హిట్ ఇచ్చుకోవాలని డిసైడ్ అయి కథ రాసుకున్నాడు. తమ్ముడు కృష్ణ పోతినేని నిర్మాతగా సొంతంగా సినిమా తీయాలని డిసైడ్ అయ్యాడు. ప్రస్తుతం నటీనటులు, టెక్నీషియన్స్ సెలెక్షన్ లో రామ్ బిజీగా ఉన్నాడు.
Also Read
- Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! 'జై హనుమాన్' అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
- Akshara Haasan: "టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా".. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
- Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
- Varalaxmi Sarathkumar: "నాకు పిల్లలు పుట్టరని కాదు.. నేనే వద్దనుకున్నా"
మొదటి నుంచి తన సినిమాల కథ, స్క్రీన్ ప్లే విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టే కిరణ్ అబ్బవరం, రియాలిటీ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మధ్యకాలంలో ‘క’ వంటి సక్సెస్ఫుల్ మూవీస్ ఉన్నా, ప్యాషన్ తో మెగాఫోన్ పడుతున్నాడు కిరణ్. ప్రస్తుతం నటిస్తున్న చెన్నై లవ్ స్టోరీ రిలీజ్ కు రెడీగా ఉండగా, ‘క’ సీక్వెల్ ‘క 2’ కూడా లైన్ లో ఉంది.
ఈ నగరానికి ఏమైంది మూవీతో యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్సేన్, ఫలక్నామా దాస్ తో యాక్టర్ గా, రైటర్ గా, దర్శక నిర్మాతగా ఒకేసారి నాలుగు అవతారాలు ఎత్తాడు. రెండోసారి డైరెక్ట్ చేసిన దాస్ కా దంకి కమర్షియల్ గా ఓకే అనిపించుకుంది. మళ్ళీ గ్యాప్ తర్వాత కల్ట్ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు.
డైరెక్షన్ చేయడం చాలా కష్టం, అందుకే చాలా మంది స్టార్స్ మెగాఫోన్ కి దూరంగా ఉన్నారు. ఎన్టీఆర్, కృష్ణల లాగా మరో హీరో సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిపించుకోలేదు. జానీ ఫ్లాప్ తో పవన్ మరోసారి డైరెక్షన్ వైపే చూడలేదు. అయితే ఇప్పటి జనరేషన్ హీరోస్ మాత్రం ఎప్పటికైనా డైరెక్టర్ అనిపించుకుంటాం అంటున్నారు.
సిద్ధు జొన్నలగడ్డలో చాలా షేడ్స్ ఉన్నాయి. ఒక యాక్టర్ గానే కనిపిస్తున్నా, మంచి స్టోరీ టెల్లర్, రైటర్. పేరు పడకపోయినా, ఇండైరెక్ట్ గా ఈ యంగ్ హీరోలో ఓ డైరెక్టర్ ఉన్నాడు. టిల్లు స్క్వేర్ తో రైటర్ అవతారం ఎత్తి, లిల్లీ సాంగ్ ను రాశాడు సిద్ధు.
నవీన్ పొలిశెట్టి యాక్టరే కాదు; కథలో, స్క్రీన్ ప్లే లో, డైరెక్షన్ లో.. ఇలా ఒక్కటేంటి అన్నింటిలోనూ ఇన్వాల్వ్ అయిపోతాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయకు స్క్రీన్ ప్లే అందించాడు నవీన్. ఈ మల్టీ టాలెంటెడ్ హీరో ఎప్పటికైనా మెగాఫోన్ పట్టడం ఖాయం.
అడవి శేష్ సినిమాలో డైరెక్టర్ గా మరొకరు కనిపిస్తారే కానీ, అన్ని తానే చూసుకుంటూ క్షణం, గూఢచారి, మేజర్, డెకాయిట్ తో పాటు సెట్స్ పై ఉన్న గూఢచారి 2 కథ కూడా అడవి శేష్ రాసుకున్నదే కావడం విశేషం. తన సినిమా కథలను తనే ఎంచుకుంటూ, ఏదో ఒక రోజు అడవి శేష్ డైరెక్టర్ అనిపించుకుంటాడు.
తాజావార్తలు
-
Satyagraha: రాహుల్ గాంధీ కొత్త అస్త్రం .. ఒంటరిగా పోరాడొద్దు.. తోడుగా నేనుంటా!
-
Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
-
India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
-
Flydubai Pilot: కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు రూ.1 కోటి.. Flydubai ఘటనలో ధైర్యానికి Mankind Pharma భారీ సత్కారం
-
Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! ‘జై హనుమాన్’ అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!