Site icon NTV Telugu

Tollywood strike: కృష్ణానగర్‌లో సినీ కార్మికుల సమ్మె మరింత ముదురుతున్న ఉద్రిక్తత

Tollywood Stik

Tollywood Stik

టాలీవుడ్‌లో గత వారం నుంచి కొనసాగుతున్న సినీ కార్మికుల సమ్మె ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు మరియు ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధుల మధ్య పలుమార్లు చర్చలు జరిగినప్పటికీ, ఎటువంటి స్పష్టమైన పరిష్కారం దొరకకపోవడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. ఈ నేపధ్యంలో, కృష్ణానగర్‌లో 24 క్రాఫ్ట్ విభాగాలకు చెందిన వందలాది మంది కార్మికులు భారీ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.

Also Read : Tollywood strike : సినీ కార్మికుల 7వ రోజు సమ్మె అప్డేట్

ఈ నిరసనలో పలువురు నేతలు నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఫైటర్స్ యూనియన్ ప్రతినిధులు మాట్లాడుతూ – “మాకు స్కిల్ లేదని ఎలా అంటారు? స్కిల్ లేకపోతే ఇంతకాలం వందల సినిమాల్లో ఎలా పని చేసాం?” అని ప్రశ్నించారు. తాము ఎటువంటి అనవసర ఒత్తిడి చేయడం లేదని, కానీ తమ కష్టానికి తగిన గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

వేతనాలు పెంచాలని అడిగితే కేసులు వేయడం సరికాదని వారు మండిపడ్డారు. “సినిమాల్లో వచ్చే లాభాల్లో వాటాలు అడగడం లేదు, కేవలం మా కష్టానికి సరిపడే వేతనం మాత్రమే కోరుతున్నాం” అని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ సమ్మె కారణంగా అనేక సినిమా షూటింగ్‌లు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. పెద్ద సినిమాల నుంచి చిన్న బడ్జెట్ ప్రాజెక్టుల వరకు ప్రభావం చూపే అవకాశాలు కనబడుతున్నాయి. చర్చలు విఫలమైన ఈ దశలో, పరిశ్రమ భవిష్యత్తు ఎలా మలుపు తిరుగుతుందో చూడాలి.

Exit mobile version