NTV Telugu Site icon

Tollywood: బాలీవుడ్ మోజులో టాలీవుడ్ కు నో చెప్పిన భామలు ఎవరంటే..?

Untitled Design 2024 08 11t135910.988

Untitled Design 2024 08 11t135910.988

సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా తెలుగులో ఓ వెలుగు వెలిగిన పూజా హెగ్డేకు ఇప్పుడు ఆశించిన స్థాయిలో ఆఫర్లు లేవు. ఒక లైలా సినిమాతో  టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన పూజాకు మొదట్లో అంతగా సక్సెస్ లు రాకున్నా యాక్టింగ్ తో మెప్పించి టాలివుడ్ స్టార్ హీరోల సరసన ఛాన్సులు దక్కించుకొంది. పూజా హెగ్డే రెండేళ్ల ముందు వ‌ర‌కు వ‌రుస భారీ చిత్రాల‌తో, స్టార్ హీరోల స‌ర‌స‌న న‌టిస్తూ ఫుల్ బిజీగా ఉంది. అయితే వ‌రుస ప‌రాజ‌యాలు ఆమెను ప‌ల‌క‌రించ‌టంతో అవ‌కాశాలు రాలేదు. తెలుగులో పూజా లాస్ట్ సినిమా రెబల్ స్టార్ సరసన నటించిన ‘రాధేశ్యామ్’.   అది కూడా ఫ్లాప్ అయింది.

Also Read: Tollywood: చిన్న సినిమా.. రీసౌండ్ వచ్చేలా కలెక్షన్స్.. ఏమిటా సినిమా..?

బుట్ట‌బొమ్మ గుంటూరు కారం లో మహేశ్ పక్కన అవకాశం వచ్చినా కూడా బాలీవుడ్ సినిమా కోసం ఈ సినిమా నుండి తప్పుకుని నార్త్ సినిమాల‌పై ఎక్కువ ఫోక‌స్ చేసింది. ఇప్పుడామె లిస్టులో అన్నీ బాలీవుడ్ సినిమాలే ఉన్నాయి. దీంతో ఆమెను టాలీవుడ్ ప్రొడ్యూస‌ర్స్ కూడా పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌టం లేదు. ప్రస్తుతం సౌత్‌లో నటిస్తున్న ఒకే ఒక సినిమా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో  రానున్న సూర్య 44వ సినిమా మాత్రమే.

Also Read : Mohan Babu: శ్రీ విద్యానికేతన్ 13వ గ్రాడ్యుయేషన్ డే, MBU స్నాతకోత్సవ వేడుకలు

అయితే ఇప్పుడు ఇదే రూట్‌ను మృణాల్ ఠాకూర్ ఫాలో అవుతున్నట్టు కనిపిస్తోంది. సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను కొల్ల‌గొట్టింది మృణాల్ ఠాకూర్. ఆ త‌ర్వాత నానితో కలిసి న‌టించిన హాయ్ నాన్న చిత్రం కూడా  సూపర్ హిట్ సాధించింది. ముచ్చటగా మూడవ సినిమాగా విజయ్ దేవరకొండతో చేసిన ఫ్యామిలీ స్టార్ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా మిగిలింది. దీంతో ఈ భామ ముంబై ఫ్లయిట్ ఎక్కేసింది. టాలీవుడ్‌లో అవ‌కాశాలు వచ్చినా ఎదో ఒక వంకతో మృణాల్ ఒప్పుకోవ‌టం లేదు. ఈ మ‌రాఠీ ముద్దుగుమ్మ ఇప్పుడు హిందీ సినిమాలే చేస్తానంటోంది. బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ తో నటిస్తోంది. గతంలో ఇలాగే ఇలియానా వంటి ఎందరో భామలు బాలీవుడ్ డ్రీమ్స్ లో ఉంటూ సౌత్ కు సారీ చెప్పేసి ఇప్పుడు సినిమాలకు ఎండ్ కార్డు వేసుకున్నారు. అలాగే పూజ, మృణాల్ లా ముచ్చట ఏంటో రానున్న రోజులు ఆగితే కానీ తెలియదు.

Show comments