NTV Telugu Site icon

సింగిల్ ఫ్రేమ్ లో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్

Tollywood star directors in a single frame

టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ అంతా ఒకే ఫ్రేమ్ లో ఉంటే ఎలా ఉంటుంది. ఇప్పుడు అదే పని చేశారు స్టార్ డైరెక్టర్స్ అంతా కలిసి. తెలుగు సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖ దర్శకులంతా కలిసి ఒకే ఫ్రేమ్ లో ఉన్న పిక్ ఒకటి నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. దానికి ఓ వేడుక కారణమైంది. టాలెంటెడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి జూలై 25న తన 42వ పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ వేడుకలు వంశీ తన స్నేహితులు, చిత్ర పరిశ్రమకు చెందిన సహచరులతో కలిసి ప్రత్యేకంగా జరుపుకున్నారు. కోవిడ్ -19 ప్రోటోకాల్స్‌కు కట్టుబడి ఏర్పాటు చేసిన వంశీ పుట్టినరోజు వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ, పరశురామ్, సుకుమార్, బోయపాటి శ్రీను, మెహర్ రమేష్, కీర్తి సురేష్, దిల్ రాజు, ఆయన భార్య, సంగీత, కార్తీ , అల్లు అరవింద్, సోనూసూద్ తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Read Also : ఓటీటీ వద్దు… థియేటరే ముద్దు: ఆర్. నారాయణమూర్తి

అందులో భాగంగానే చిరంజీవి, పరశురం, సుకుమార్, కొరటాల శివ, బోయపాటి శ్రీను, మెహర్ రమేష్ లు ఒక సెల్ఫీ తీసుకున్నారు. అయితే వంశీ పుట్టినరోజు జరుపుకుని దాదాపు మూడు రోజులు అవుతోంది. చాలా ఆలస్యంగా ఈ పిక్ బయటకు వచ్చింది. అయినప్పటికీ టాలీవుడ్ ఏస్ దర్శకులందరినీ కలిసి ఒకేచోట చూడటం చాలా ఆనందకరమైన విషయం. ఇక వంశీ పైడిపల్లి తలపతి విజయ్‌తో కలిసి ‘తలపతి 66’ కోసం పని చేయనున్నారు. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం తమిళ, తెలుగు ద్విభాషా చిత్రంగా రూపొందుతోంది.