Tollywood : సెన్సార్ లేట్.. ఈ వారం సినిమాలు వాయిదా?

Tollywood

Tollywood

ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికరమైన విషయం చోటు చేసుకుంది. అదేంటంటే, ప్రతివారం కొన్ని సినిమాలు విడుదలకు రెడీ అవుతూ ఉంటాయి; ఈ వారం కూడా కొన్ని సినిమాలు రిలీజ్‌కి రెడీ అయ్యాయి. అన్నపూర్ణమ్మ, ఝాన్సీ లాంటి సీనియర్ నటీమణులతో పాటు యంగ్ యాక్టర్స్ వంశీ, రవి శివతేజ, హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ వంటి వారు ప్రధాన పాత్రలలో నటిస్తున్న ‘హ్యాపీ జర్నీ’, రాగ్ మయూర్ హీరోగా నటిస్తున్న ‘అనుమానపక్షి’ సినిమాలతో పాటు, సూర్య శ్రీనివాస్, నిహాల్ కోదాటి హీరోలుగా ‘సీక్రెట్ సోల్జర్’ లాంటి సినిమాలతో పాటు, బాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన హనుమాన్ అన్ష్ సినిమా తెలుగులో రిలీజ్‌కి రెడీ అయ్యాయి.

అయితే సెన్సార్ అధికారి ప్రస్తుతానికి లీవ్‌లో ఉన్న కారణంగా, ఇందులో కొన్ని సినిమాలకు ఇంకా సెన్సార్ పూర్తి కాలేదని తెలుస్తోంది. దీంతో ఇప్పటివరకు ఆ సినిమాలు రిలీజ్ అవుతాయా, వాయిదా పడతాయా అనే విషయం మీద క్లారిటీ లేదు. సెన్సార్ ఫార్మాలిటీస్ క్లియర్ అయి సర్తేటిఫికేట్ చేతికి వస్తే ఆ సినిమాలు ఈ వారమే, అంటే ఎల్లుండి రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

లేదంటే కనుక, సెన్సార్ ఫార్మాలిటీస్ ఆలస్యం అయితే కనుక వచ్చే వారానికి వాయిదా పడక తప్పని పరిస్థితి. అయితే వచ్చే వారమే ‘పారడైజ్’ సినిమా ఉంది కాబట్టి, ఈ సినిమాలు ఆ సినిమాతో పోటీ పడుతూ రిలీజ్‌కి రెడీ అవుతాయా లేక ఇంకాస్త వెనక్కి వెళ్తాయా అనే విషయం మీద ప్రస్తుతానికైతే క్లారిటీ లేదు. అయితే సెన్సార్ అధికారి అందుబాటులోకి వచ్చిన వెంటనే సెన్సార్ చేయించడానికి టీమ్స్ అయితే సిద్ధమవుతున్నాయి. మరి ఏం జరగబోతుంది అనేది చూడాల్సి ఉంది. కానీ ముందే కంటెంట్ రెడీ చేసుకుని సెన్సార్ కు వెళ్లి ఉంటే కనుక ఇలాంటి ఇబ్బందులు, లాస్ట్ మినిట్ టెన్షన్స్ తప్పేవని అంటున్నారు విశ్లేషకులు.