Site icon NTV Telugu

WAR 2 : వార్ 2 తెలుగు కోసం పట్టువదలని టాలీవుడ్ ప్రొడ్యూసర్

War2

War2

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న స్ట్రెయిట్ బాలీవుడ్ సినిమా వార్ 2. బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన హృతిక్ రోషన్ తో  కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు ఎన్టీఆర్. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లిమ్స్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాయి. ఎన్టీఆర్, హృతిక్ మధ్య వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ ఫ్యాన్స్ కు విజువల్ ఫీస్ట్ ఇస్తాయని యూనిట్ కూడా బలంగా నమ్ముతోంది. యష్ రాజ్ ఫిల్మ్స్ నిమిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం ఏడాది ఆగస్టు 14 న ఈ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది.

Also Read : 23 Movie : ఓటీటీ స్ట్రీమింగ్ కొచ్చిన చరిత్రలో నిలిచిపోయిన కథ ’23’

కాగా ఈ సినిమా తెలుగు రైట్స్ కోసం విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. కానీ అసలు నిర్మాతలు సుమారు రూ. 100 కోట్లు మేర ధర చెప్పడంతో టాలీవుడ్ నిర్మాతలు వెనక్కుతగ్గారు. దాంతో తామే స్వయంగా రిలీజ్ చేయాలనీ భావించింది నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్. అందుకుఅనుగుణంగా పలు థియేటర్స్ తో అగ్రిమెంట్స్ కూడా చేసింది. అయితే ఇప్పుడు మరోసారి వార్ 2 తెలుగు రైట్స్ కోసం
టాలీవుడ్ కు చెందిన బడా నిర్మాత సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అలాగే ఏషియన్ సినిమాస్ నిర్మాత కమ్ డిస్ట్రిబ్యూటర్ అయిన ఏషియన్ సునీల్ కూడా వార్ 2 కోసం ప్రయత్నించి బేరం కుదరకపోవడంతో సూపర్ స్టార్ రజనీకాంత్ ‘కూలీ’ తెలుగు రైట్స్ ను భారీ ధరకు కొనుగులు చేశారు. అయితే నాగవంశీ మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా బాలీవుడ్ నిర్మాతతో మంతనాలు చేస్తూనే ఉన్నారు. ఒకవేళ నాగవంశీ చేతికి వస్తే తెలుగు రాష్ట్రాల్లో ఏషియన్ వర్సెస్ సితార గా మారుతుంది.

Exit mobile version