Site icon NTV Telugu

Tollywood: కొత్త సినిమాలను పైరసీ చేస్తున్న వ్యక్తి అరెస్టు

Theatres

ఇప్పటికే అనేక రకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్న తెలుగు సినీ పరిశ్రమను పైరసీ భూతం వెంటాడుతోంది. ఈ మధ్యకాలంలో పైరసీ తగ్గిందని అనుకుంటుంటే, మళ్లీ అది రాక్షసిలా జడలు విప్పుతోంది. తాజాగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కొత్త సినిమా పైరసీ చేస్తున్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. భారీ బడ్జెట్‌తో విడుదలైన సినిమాలను మొదటి రోజే పైరసీ చేస్తున్న కిరణ్ అనే వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Also Read:YS Jagan: మరోసారి చిత్తూరు జిల్లా పర్యటనకు వైఎస్ జగన్‌..

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కిరణ్ కుమార్ హైదరాబాద్‌లో పైరసీకి పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రేక్షకుల మధ్యలో కూర్చొని సెల్‌ఫోన్ ద్వారా సినిమాలను షూట్ చేసి, పైరసీ చేస్తున్నాడు కిరణ్. ఇలా ఇప్పటివరకు 65 సినిమాలను కిరణ్ పైరసీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. పైరసీ చేసిన సినిమాలను సోషల్ మీడియాలో పెట్టి, తద్వారా ఆర్థిక లాభం పొందుతున్నట్లు తెలుస్తోంది.

Also Read:Illegal Affair : ఈమె కామపిశాచికి తక్కువేం కాదు.. మరిది, పెద్ద మరిది.. తరువాత..

మరోవైపు, తాజాగా తమ్ముడు సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా దిల్ రాజు కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా హైదరాబాద్‌లో పోలీసులు ఇలాగే పైరసీ చేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారని ఆయన అన్నారు. వారంతా చిన్న సినిమాను 400 డాలర్లకు, పెద్ద సినిమాను వేయి డాలర్లకు అమ్మేస్తున్నారని, ఇలా చేయడం తెలుగు సినీ నిర్మాతలకు పెద్ద గొడ్డలిపెట్టుగా మారుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.

Exit mobile version