Tollywood Pan World Movies: అందరికీ ‘పాన్ వరల్డ్ మూవీ’నే కావాలా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tollywood Pan World Movies: డైరెక్ట్ పాన్ ఇండియా హిట్ లేని హీరోలు సైతం ఇప్పుడు ‘పాన్ వరల్డ్’ మంత్రం జపిస్తుండటం టాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త చర్చకు దారితీస్తోంది. ఒకప్పుడు సినిమా అంటే కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం. కానీ ‘బాహుబలి’ తర్వాత సరిహద్దులు చెరిగిపోయి పాన్ ఇండియా సినిమాల జోరు పెరిగింది. ఇప్పుడు ఆ పరిధి దాటి మన మేకర్స్ ‘పాన్ వరల్డ్’ దిశగా అడుగులు వేస్తున్నారు. వారణాసి, రాకా, స్పిరిట్, డ్రాగన్, ది పారడైజ్ వంటి సినిమాలు ఇప్పుడు ఈ వరుసలో ఉన్నాయి. ప్రస్తుతం తెలుగు సినిమాల బడ్జెట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి. టాప్ హీరోల రెమ్యునరేషన్లు, భారీ యాక్షన్ సీక్వెన్స్, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన VFX కోసం వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు. కేవలం సౌత్ ఇండియన్ మార్కెట్‌తో ఈ పెట్టుబడిని వెనక్కి రాబట్టడం కష్టంగా మారుతోంది. అందుకే విదేశీ మార్కెట్‌పై కన్నేసి, అక్కడ కూడా రిలీజ్ చేయడం ద్వారా బడ్జెట్‌ను కవర్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
ఎక్కువ భాషల్లో సినిమా రిలీజ్ అవుతుందంటే, ఆటోమేటిక్ గా డిజిటల్ రైట్స్ (OTT) ధరలు పెరుగుతాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి సంస్థలు గ్లోబల్ అప్పీల్ ఉన్న సినిమాలకు భారీ ఆఫర్లు ఇస్తుండటంతో, నిర్మాతలు ‘పాన్ వరల్డ్’ ట్యాగ్‌ను మార్కెటింగ్ అస్త్రంగా వాడుకుంటున్నారు.
రాజమౌళి – మహేష్ బాబు (వారణాసి)కి ‘పాన్ ఇంటర్నేషనల్ మూవీ’గా బీజం పడింది. కెన్యా అడవుల్లో షూటింగ్, దాదాపు 120 దేశాల్లో విడుదల చేయాలన్న ప్లాన్‌తో రాజమౌళి గ్లోబల్ స్థాయికి తెలుగు సినిమాను తీసుకెళ్తున్నారు. అల్లు అర్జున్ – రాకా (RAKA) హాలీవుడ్ నిపుణులతో VFX వర్క్ చేయిస్తూ, గ్లోబల్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తున్నారు. ప్రభాస్ – స్పిరిట్ చైనా, జపాన్, కొరియా దేశాల్లో భారీగా రిలీజ్ చేయనున్నారు. నేచురల్ స్టార్ నాని కూడా ఈ రేసులో చేరారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రాన్ని ఏకంగా 8 భాషల్లో విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబో కూడా పాన్ వరల్డ్ సినిమాగా రాబోతుందని నిర్మాతలు ఇప్పటికే స్పష్టం చేశారు.
Also Read
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
గతంలో ‘కల్కి 2898 AD’, ‘హనుమాన్’ వంటి చిత్రాలు వరల్డ్ వైడ్ రిలీజ్ అంటూ భారీగా ప్రచారం చేశాయి. కానీ ఆశించిన స్థాయిలో విదేశీ భాషల్లో లేదా అంతర్జాతీయ మార్కెట్‌లో అవి ప్రభావం చూపలేకపోయాయి. కేవలం ప్రచారం కోసమే ‘పాన్ వరల్డ్’ అని పిలుచుకోవడం వల్ల లాభం లేదని, కంటెంట్‌లో కూడా ఆ గ్లోబల్ కనెక్టివిటీ ఉండాలని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టాలీవుడ్ హీరోలు ఇప్పుడు లోకల్ నుంచి గ్లోబల్ స్టార్స్‌గా ఎదిగే క్రమంలో ఉన్నారనడంలో సందేహం లేదు. అయితే, ఈ పాన్ వరల్డ్ ఫార్ములా కేవలం బడ్జెట్‌ను కవర్ చేసే ‘నెంబర్ గేమ్’గా మారుతుందా లేక నిజంగానే తెలుగు సినిమా జెండాను ప్రపంచ స్థాయిలో ఎగురవేస్తుందా అనేది వేచి చూడాలి.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?