Tollywood: తెలుగు మీద కన్నేస్తున్న తమిళ, మలయాళ, కన్నడ హీరోలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ పాన్ ఇండియా స్టాయి దాటి హాలీవుడ్ రేంజ్‌కు చేరాక.. ఇతర ఇండస్ట్రీ యాక్టర్ల దండయాత్ర స్టార్ట్ అయ్యింది. బాలీవుడ్ నుంచి హీరోయిన్స్, విలన్స్ హడావుడి పెరిగింది. ఇక సౌత్‌లో ఏ స్టార్ హీరో సినిమా స్టార్ట్ చేసినా తెలుగు మార్కెట్ కొల్లగొట్టేందుకు ఇక్కడ డబ్ చేస్తున్నారు. ఈ ప్రయత్నాలు కొన్ని సార్లు వర్కౌట్ అయి, కొన్ని సార్లు బెడిసికొట్టాయి.. దీంతో ఇలా కాదని టాలీవుడ్ ప్రేక్షకులకు నేరుగా చేరువయ్యేందుకు.. తమ ఇమేజ్ పెంచుకునేందుకు ఫోకస్ పెంచుతున్నారు స్టార్ హీరోలు. కార్తీ ఎప్పుడో ఈ స్టెప్ తీసుకోగా.. రీసెంట్గా జాయిన్ అయ్యారు దుల్కర్ అండ్ రిషబ్ శెట్టి.
Also Read:Murugadoss : సికిందర్ ఫెయిల్యూర్.. మురుగదాస్ కవర్ డ్రైవ్!
Also Read
ఊపిరితో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన కార్తీని బ్రదర్ ఫ్రం అనదర్ మదర్‌గా ట్రీట్ చేస్తోంది టాలీవుడ్. ఈ మధ్య డబ్బింగ్ చిత్రాలతో పలకరించినా.. హిట్4తో మరోసారి ఇక్కడి ఆడియన్స్‌కు హాయ్ చెబుతానంటున్నాడు. ఇక దుల్కర్ సల్మాన్ సంగతి చెప్పనక్కర్లేదు.. మాలీవుడ్ ట్యాగ్ ఉన్నా.. టాలీవుడ్ హీరోని చేశాయి తెలుగు ఫిల్మ్స్. మహానటి నుంచి లక్కీ భాస్కర్ వరకు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చి ఓన్ చేసేసుకున్నారు తెలుగు మూవీ లవర్స్. అందుకే తనకు స్టార్డమ్ ఇచ్చిన ఇక్కడి ప్రేక్షకులకు తిరిగి ఏదో ఒక రూపంలో ఇచ్చేయాలని గట్టిగానే ఫిక్స్ అయిన దుల్కర్.. నెక్స్ట్ కాంత, ఆకాశంలో ఓ తార లాంటి స్ట్రైట్ ఫిల్మ్స్ చేస్తున్నాడు.
Also Read:Samantha: సమంత రెండో పెళ్లి.. నటనకు గుడ్ బై?
వీరితో పాటు సూర్య, ధనుష్ బైలింగ్వల్ ఫిల్మ్స్‌తో లేదా టాలీవుడ్ దర్శకులతో టైఅప్ అవుతూ ఇక్కడి మార్కెట్ కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక కాంతార ఫేం రిషబ్ శెట్టి.. ఇటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్‌పై ఏకకాలంలో ఫోకస్ చేస్తున్నాడు. చత్రపతి శివాజీ ఆధారంగా ఓ బాలీవుడ్ మూవీకి కమిట్ అయిన రిషబ్.. తెలుగులో నేరుగా జై హనుమాన్తో పాటు నాగ వంశీ ప్రొడక్షన్లో ఓ మూవీకి కమిట్ అయ్యాడు. ఇలా సదరన్ ఇండస్ట్రీలోని ఇతర స్టార్ హీరోలు టాలీవుడ్‌పై ఫోకస్ చేసి తమ ఇమేజ్, మార్కెట్ పెంచుకునేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఈ పరంపర కంటిన్యూ అయితే.. మన మిడిల్ రేంజ్ హీరోలపై ఎఫెక్ట్ చూపే ఛాన్స్ ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు.
తాజావార్తలు
-
Stock Market Crash: కుప్పకూలిన షేర్ మార్కెట్.. సెన్సెక్స్ 1100 పాయింట్లు పతనం.. లక్షల కోట్లు గాల్లోనే!
-
LPG dealerships: గ్యాస్ ఏజెన్సీ ఆఫర్.. ఈ తరహా మెసేజీలు వస్తున్నాయా? ప్రభుత్వం ఏం చెబుతుందంటే..?
-
Fake IPS Officer: నకిలీ ఐపీఎస్ ముఠా గుట్టురట్టు.. సూడో పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేసి కిడ్నాప్‌లు, వసూళ్లు!
-
PEDDI Hikes : పెద్ది తెలంగాణ టికెట్ ధరల పెంపు.. జీవో వెనుక చక్రం తిప్పిన టాలీవుడ్ బడా నిర్మాత
-
Tamballapalle MLA: చావడానికైనా, చంపడానికైనా సిద్ధం.. తంబళ్లపల్లె ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్‌తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!