Tollywood: పుష్ప 2 తర్వాత 20 తెలుగు పాన్ ఇండియా ఫెయిల్యూర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా సినిమాలను పరిచయం చేసిన టాలీవుడ్ వెనకపడిపోయింది. సినిమా మొదలైనప్పుడే హిందీతో పాటు సౌత్ లోని అన్ని లాంగ్వేజెస్ లో రిలీజ్ చేస్తామని ప్రకటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీస్ వరుసగా ఫెయిల్యూర్ కావడంతో, తెలుగు సినిమా ఇండస్ట్రీ వరుస ఫెయిల్యూర్స్ చూడాల్సి వస్తుందా? పుష్ప 2 తర్వాత ఓ 20 తెలుగు సినిమాలు హిందీలో రిలీజ్ అయితే ఒక్కటి సక్సెస్ కాలేదు.
బాహుబలి ఇన్స్పిరేషన్ తో సౌత్ సినిమాలు ఇండియా వైడ్ రిలీజ్ అయ్యాయి. పుష్ప, కార్తికేయ 2, కాంతార హిట్ కావడంతో పాన్ ఇండియా జోరు పెరిగింది. పుష్ప 2 అయితే ఏకంగా హిందీలో కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఇదే జోరుతో రిలీజ్ అయిన తెలుగు పాన్ ఇండియా మూవీస్ బాలీవుడ్ దగ్గర చతికిలపడ్డాయి.
Also Read
- Toxic Advance Booking: యష్ ‘టాక్సిక్’కు కౌంట్‌డౌన్.. అడ్వాన్స్ బుకింగ్స్ ఎప్పటి నుంచంటే?
- Party Movie: అస్తిత్వాల అంతర్మథనం "పార్టీ"
- Mohanlal: కుర్ర హీరోలకే షాకిచ్చేలా .. ఒకేసారి 7 స్టార్ డైరెక్టర్లతో సినిమాలు అనౌన్స్ చేసిన లెజెండరీ హీరో!
- Prabhas-Hanu Raghavapudi: ‘ఫౌజీ’తో ఆగదట.. హను రాఘవపూడితో ప్రభాస్ మరోసారి జతకట్టనున్నాడా?
RRRతో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అనిపించుకున్నారు. అయితే, ఆ తర్వాత వచ్చిన ‘గేమ్ ఛేంజర్’ ను బాలీవుడ్ ఆడియన్స్ పట్టించుకోలేదు. ‘పెద్ది’ హిందీ వసూళ్లను కొల్లగొడుతుందని నిర్మాతలు ఎక్స్పెక్ట్ చేశారు, టీం నార్త్ కు మూడు సార్లు వెళ్లి మరీ ప్రచారం చేసినా బాలీవుడ్ ఆడియన్స్ కు కాన్సెప్ట్ నచ్చక రిజెక్ట్ చేశారు. బాలీవుడ్ హిట్ ‘చందు ఛాంపియన్’ కథతో ‘పెద్ది’ పోలి ఉండడంతో హిందీ ప్రేక్షకులకు కొత్తగా అనిపించలేదు.
‘దసరా’ నుంచి నాని తన ప్రతి సినిమాతో పాన్ ఇండియాలోకి అడుగు పెడుతున్నా, తెలుగు ఆడియన్స్ తప్ప అందరూ రిజెక్ట్ చేస్తున్నారు. పాన్ ఇండియా హీరో అనిపించుకోవాలన్న కల మాత్రం తీరడం లేదు. మరి ‘పారడైజ్’ తోనైనా నాని డ్రీమ్ తీరుతుందో లేదో చూడాలి మరి.
పాన్ ఇండియా హిట్ కొట్టడం అంటే చాలా కష్టం. బాహుబలి, పుష్ప, పుష్ప 2, హనుమాన్, కార్తికేయ 2, దేవర.. అంటే ఏడు ఎనిమిది సినిమాలే ఆ రేర్ ఫీట్ సాధించాయి. అన్ని లాంగ్వేజ్ ఆడియన్స్ కు నచ్చే కథ రెడీ చేయడం పైనే పాన్ ఇండియా సక్సెస్ ఆధారపడి ఉంది. ‘కుబేర’ కథ తెలుగు ఆడియన్స్ కు నచ్చే హిట్ చేసినా, ధనుష్ సొంత లాంగ్వేజ్ తమిళంలో డిజాస్టర్ అయింది, హిందీ ఆడియన్స్ కూడా రిజెక్ట్ చేశారు.
‘కన్నప్ప’ కోసం ఒక్కో లాంగ్వేజ్ నుంచి ఒక్కో సూపర్ స్టార్ ని తీసుకున్నారు. స్టార్స్ ఎంతమంది ఉన్నా వాళ్ళ ఓన్ లాంగ్వేజ్ లో హిట్ అవుతుందన్న గ్యారెంటీ లేదు, ఇందుకు ‘కన్నప్ప’ ఓ ఎగ్జాంపుల్. కన్నప్పకు తెలుగులో యావరేజ్ టాక్ వచ్చినా డబ్బులు రాలేదు, మిగిలిన అన్ని భాషల్లో డిజాస్టర్ అయింది. మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్ వంటి స్టార్స్ నటించిన కన్నప్పకు బాక్సాఫీస్ కష్టాలు తప్పలేదు.
నాలుగైదు భాషల్లో రిలీజ్ చేస్తే సాటిలైట్, ఓటీటీ రైట్స్ ఎక్కువ వస్తుందనే ప్లాన్ తో దర్శక నిర్మాతలు బడ్జెట్ పెంచేస్తున్నారు. పాన్ ఇండియాతో బయట పడొచ్చన్న ప్లాన్ రివర్స్ అవుతోంది. కొచ్చి, చెన్నై, బెంగళూర్, ముంబై వెళ్లి ప్రమోట్ చేసిన ఖర్చులు కూడా రావడం లేదు. తమన్నా నటించిన హారర్ థ్రిల్లర్ ‘ఓదెల 2’ పాన్ ఇండియాగా రిలీజ్ చేస్తే నిరాశ మిగిలింది. జాలరి జీవిత కథ ఆధారంగా తీసిన ‘తండేల్’ తెలుగు ఆడియన్స్ కు మాత్రమే నచ్చింది.
పుష్ప 2 తర్వాత పాన్ ఇండియా హిట్ కొట్టిన తెలుగు సినిమా కనిపించలేదు. హిందీలో ఒక్క హిట్ పడితే మార్కెట్ పెరుగుతుంది, రెమ్యూనరేషన్ పెంచేయొచ్చన్న ఆశ అందరికీ ఉన్నా హిట్టే రావడం లేదు. చిరంజీవి ‘సైరా’, ‘గాడ్ ఫాదర్’ తో హిందీలో అడుగుపెట్టినా క్లిక్ కాలేదు. బాలకృష్ణ కంటిన్యూస్ గా నాలుగు హిట్స్ కొట్టినా హిందీలో మాత్రం హిట్ పడడం లేదు, తన ఇమేజ్ ను స్ప్రెడ్ చేసుకోవాలనుకున్నా తెలుగు రాష్ట్రాలకే పరిమితమవుతున్నాడు. ‘అఖండ 2’ తో మరోసారి అదృష్టం పరీక్షించుకుంటే దురదృష్టమే మిగిలింది.
తాజావార్తలు
-
Devdutt Padikkal: నా అద్భుత ప్రదర్శనకు కారణం ఇదే.. పడిక్కల్ సీక్రెట్ టెక్నిక్ రివీల్..
-
Toxic Advance Booking: యష్ ‘టాక్సిక్’కు కౌంట్‌డౌన్.. అడ్వాన్స్ బుకింగ్స్ ఎప్పటి నుంచంటే?
-
David Warner: మూడు గ్లాసుల మందు… కుటుంబంతో ప్రయాణం.. స్టార్ క్రికెటర్‌కు కోర్టు ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్..
-
Bajaj Chetak Sales Surge 307 Percent: రూ.35 ఛార్జింగ్‌తో 153 కిలో మీటర్లు..! ఏకంగా 307 శాతం పెరిగిన అమ్మకాలు
-
CM Revanth Reddy: 22-ఏ భూములపై సీఎం కీలక సమీక్ష.. 2 రోజుల్లోనే పరిష్కారం..! దళారులను ఆశ్రయించవద్దు..
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!