Tollywood: దేవుళ్ళ చుట్టూ సినీ ఇండస్ట్రీ.. ఇప్పుడిదే ట్రెండు గురూ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tollywood movies Based on Gods are Trend now : మాములుగా సినీ పరిశ్రమలో ఒక్కో సారి ఒక్కో ట్రెండ్ నడుస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఇప్పుడు ట్రెండ్ చూస్తుంటే ఇండస్ట్రీ అంతా దేవుళ్ళ చుట్టూ తిరుగుతోంది. ఒకప్పుడు ఇతిహాసాలైన రామాయణ, మహా భారతాలనే సినిమాలుగా తీశారు. ఇప్పుడు మళ్లీ అదే ట్రెండ్ నడుస్తోంది. ఆ ఇతిహాసాలకు నేటి జీవితాలను కనెక్ట్ చేస్తూ చేస్తున్న సోషియో ఫాంటసీ చిత్రాలకు గిరాకీ పెరిగింది. దేవుడ్ని తెరపై అలా ఒక్కసారి చూపించినా కూడా సినిమాకు కలెక్షన్లు మోతమోగిపోతోన్నాయి. నిఖిల్ కార్తికేయ 1 అండ్ 2 చూసినా, బాలయ్య అఖండ తీసుకున్నా.. మోటన్నటి హనుమాన్‌ను తీసుకున్నా.. రీసెంట్‌గా వచ్చిన కల్కిని తీసుకున్నా కూడా ఇప్పుడంతా దేవుళ్ళ ట్రెండ్ నడుస్తోందో చెప్పాల్సిన పని లేదు.
Shivam Baje : రామ్ రామ్ ఈశ్వరం సాంగ్ అదిరిందిగా!
Also Read
దైవ భక్తిని చాటే సినిమాలు అయినా, దేవుడి శక్తిని చూపించేలా కథ, కథనాలతో ఉన్న సినిమా అయినా వచ్చిందంటే బాక్సాఫీస్ షేక్ అయిపోవాల్సిందే అన్నట్టు ఉంది పరిస్థితి. ఇక అలాంటి కొన్ని సినిమాలు ఇంకా టాలీవుడ్‌లో లైన్లో ఉన్నాయి. బాలయ్య అఖండ 2 తో పాటు కల్కి 2 ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాయి. వచ్చే ఏడాది రానున్న విశ్వంభర సోషియో ఫాంటసీ అన్న సంగతి తెలిసిందే. జై హనుమాన్ సెట్స్ మీద ఉంది. నిఖిల్ స్యయంభు, కార్తికేయ 3లు కూడా దైవ భక్తి చుట్టే ఉంటుంది అని తెలుస్తోంది. వీటి మధ్యలో అనసూయ ప్రధాన పాత్రలో నటించిన అరి కూడా వచ్చేందుకు రెడీ అవుతోంది. పేపర్ బాయ్ దర్శకుడు జయశంకర్ డైరెక్ట్ చేసిన ఈ అరి చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. ఇందులో కృష్ణుడిదే మెయిన్ పాత్రగా ప్రక్షేకుల ముందుకు తీసుకు రానున్నారు. ఇప్పటివరకు ఏ సినిమా డైరెక్టర్ టచ్ చేయని అరిషడ్వర్గాలనే కాన్సెప్ట్ మీద అరి మూవీని తెరకెక్కించాడు. ఈ మూవీ చివర్లో కృష్ణుడ్ని చూపించే సీన్‌కు గూస్ బంప్స్ పక్కా అని ఇన్ సైడ్ వర్గాల సమాచారం.
- Tags
- akhanda 3
- ARI
- kalki 2
- karthikeya 2
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!