Tollywood : మూడు సినిమాలు వస్తున్నాయ్.. చూసేవారేరి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు ఎక్కడ చూసిన పుష్ప -2 ఫీవర్ నడుస్తోంది. ఇటు ఏపీ అటు తెలంగాణలో ఎక్కడ చూసిన మెజారిటీ థియేటర్స్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప -2 నే రన్ అవుతుంది. ఉదయం ఆటతోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా బ్లాక్ బస్టర్ వసూళ్లతో దూసుకెళ్తోంది. నేటి నుండి టికెట్ ధరలు తగ్గించడంతో ఆక్యుపెన్సీ పెరుగుతుందని ట్రేడ్ అంచనా వేస్తుంది. తెలుగు, తమిళ్, కన్నడ, కేరళ, హిందిలో ఈ సినిమా సెన్సేషన్ హిట్ దిశగా వెళుతోంది.
పుష్ప ఇంతటి హవాలో కూడా ఓ మూడు సినిమాలు థియేటర్స్ లో విడుదలకు రెడీ అవుతున్నాయి. ముందుగా సిద్దార్ధ్ హీరోగా ఆషికా రంగనాథ్ జంటగా వస్తున్న చిత్రం ‘మిస్ యు’. ఈ సినిమాను తెలుగులో ఏషియన్ సురేశ్ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ సంస్థ రిలీజ్ చేస్తోంది. చెన్నైలో వరదల కారణంగా రిలీజ్ వాయిదా వేసుకునికి ఈ నెల 13న రిలీజ్ అవుతుంది. ఇక ఈ సినిమా తో పాటు సదన్ హీరోగా సాయికుమార్ కీలక పాత్రలో వస్తున్న ‘ప్రణయగోదారి’ వస్తోంది. ఇవే కాకుండా వేదిక లీడ్ రోల్ లో వస్తున్న చిత్రం ‘ఫియర్’. ‘సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ సినిమాలో అరవింద్ కృష్ణ, పవిత్ర లోకేశ్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాను ఈ నెల 14న రిలీజ్ చేస్తున్నారు. చిన్న సినిమాలుగా వస్తున్న ఈ మూడు సినిమాలకు ఏ మేరకు థియేటర్స్ వస్తాయో ఏ మేరకు జనాలు చూస్తారనే టాక్ నడుస్తోంది.
Also Read
తాజావార్తలు
-
Nirmala Sitharaman: “మరో సంక్షోభం ముంచుకొస్తోంది”.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
-
Boyapati Srinu: బాలయ్య అభిమానులకు గుడ్‌న్యూస్.. అఖండ-3పై కీలక అప్డేట్..!
-
Gautam Gambhir: “కేవలం టాలెంట్ ఉంటే సరిపోదు”.. వైభవ్ సూర్యవంశీకి బిగ్ షాక్ ఇచ్చిన కోచ్ గంభీర్..
-
Gandhi Reel Row: ఇలా చేస్తే నెక్ట్స్ మీరే?.. రూ.500 నోటుతో రీల్ చేసి అడ్డంగా బుక్కైంది.. అసలు ఏం జరిగిందంటే?
-
KA 13 : కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ రిలీజ్ డేట్ ఫిక్స్
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?