NTV Telugu Site icon

Tollywood : మూడు సినిమాలు వస్తున్నాయ్.. చూసేవారేరి..?

Tollywood

Tollywood

రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు ఎక్కడ చూసిన పుష్ప -2 ఫీవర్ నడుస్తోంది. ఇటు ఏపీ అటు తెలంగాణలో ఎక్కడ చూసిన మెజారిటీ థియేటర్స్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప -2 నే రన్ అవుతుంది. ఉదయం ఆటతోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా బ్లాక్ బస్టర్ వసూళ్లతో దూసుకెళ్తోంది. నేటి నుండి టికెట్ ధరలు తగ్గించడంతో ఆక్యుపెన్సీ పెరుగుతుందని ట్రేడ్ అంచనా వేస్తుంది. తెలుగు, తమిళ్, కన్నడ, కేరళ, హిందిలో ఈ సినిమా సెన్సేషన్ హిట్ దిశగా వెళుతోంది.

పుష్ప ఇంతటి హవాలో కూడా  ఓ మూడు సినిమాలు థియేటర్స్ లో విడుదలకు రెడీ అవుతున్నాయి. ముందుగా సిద్దార్ధ్ హీరోగా ఆషికా రంగనాథ్‌ జంటగా వస్తున్న చిత్రం ‘మిస్‌ యు’. ఈ సినిమాను తెలుగులో ఏషియన్‌ సురేశ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ లిమిటెడ్‌ సంస్థ రిలీజ్ చేస్తోంది. చెన్నైలో వరదల కారణంగా రిలీజ్ వాయిదా వేసుకునికి ఈ నెల 13న రిలీజ్ అవుతుంది. ఇక ఈ సినిమా తో పాటు సదన్‌ హీరోగా సాయికుమార్‌ కీలక పాత్రలో వస్తున్న ‘ప్రణయగోదారి’ వస్తోంది. ఇవే కాకుండా వేదిక లీడ్ రోల్ లో వస్తున్న చిత్రం ‘ఫియర్‌’. ‘సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందిన ఈ సినిమాలో అరవింద్‌ కృష్ణ, పవిత్ర లోకేశ్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాను ఈ నెల 14న రిలీజ్ చేస్తున్నారు. చిన్న సినిమాలుగా వస్తున్న ఈ మూడు సినిమాలకు ఏ మేరకు థియేటర్స్ వస్తాయో ఏ మేరకు జనాలు చూస్తారనే  టాక్ నడుస్తోంది.