NTV Telugu Site icon

Kanthi Dutt : సినిమా సెలెబ్రిటీస్ పరిచయాలతో కోట్లు కొట్టేసిన ‘కాంతి దత్’

Kanthi

Kanthi

సమంత, కీర్తి రెడ్డి ఇలా పలువురిని మోసం చేసిన కాంతి దత్ మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.  కొన్నేళ్లుగా సెలబ్రిటీలు, హీరోయిన్లు తన వ్యాపార భాగస్వాములంటూ పలువురు వ్యాపారవేత్తలను మోసం చేసాడు. పదో తరగతి కూడా పాస్ కానీ కాంతిదాత్,  విశాఖపట్నంలో పింక్‌థాన్‌ను నిర్వహించి ప్రముఖులు, సెలబ్రిటీలు హాజరయ్యేలా ప్లాన్ చేసుకున్నాడు. పింక్‌థాన్‌ కోసం విశాఖపట్నం కు చెందిన ఓ మహిళ నుండి 60 లక్షల రూపాయలు వసూలు చేసాడు. అటు తర్వాత 2018 లో విశాఖపట్నం నుండి హైదరాబాద్ కు మకాం మార్చాడు. జువెలరీ, హోటల్స్, పర్యావరణ రహిత ఉత్పత్తులు ఇలా రకరకాల పేర్లు చెప్పి మసిబూసి మారేడు కాయ చేసి కోట్లు దండుకున్నాడు.

Also Read : Pushpa2 : నేడు పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్.. ట్రాఫిక్ ఆంక్షలు విధించిన పోలీస్ శాఖ

బాలీవుడ్ నటి తన తృతీయ జ్యువెలర్స్ కు బ్రాండ్ అంబాసిడర్ అంటూ జూబ్లీహిల్స్ కు చెందిన ఇద్దరి నుండి సుమారు ఐదు కోట్ల ఎనిమిది లక్షల రూపాయల కుచ్చుటోపి పెట్టాడు కేటుగాడు కాంతి దత్. సస్టైనబుల్ కార్డు పేరుతో పర్యావరణ రహిత ఉత్పత్తులు విక్రయ కేంద్రం అంటూ రెండు కోట్ల మేర మరో మోసం. ఏపీకి చెందిన మాజీ మంత్రి సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు పార్ట్నర్స్ గా ఉన్నారంటూ నయోమి హోటల్స్ పేరుతో ఇద్దరు మహిళల నుంచి కోటి 40 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టించి మోసానికి పాల్పడ్డాడు కాంతి దత్.  జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఖాజాగూడాలలో నయోమి హోటల్స్ పేరుతో బ్రాంచ్ లు ప్రారంభించి ఆ తర్వాత కొద్ది రోజులకే   హోటల్స్ ఎత్తేసాడు. సుమారు 6 కోట్ల రూపాయల విలువైన ఇల్లును జూబ్లీహిల్స్ లో కొనుగోలు చేసిన కాంతి దత్.  జ్యువెలర్స్ పేరుతో మోసం చేసాడు అని  ఫిబ్రవరిలో జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది శ్రీజా రెడ్డి అనే మహిళ. శ్రీజా రెడ్డి ఫిర్యాదుతో కాంతి దత్ భాగోతం వెలుగులోకి వచ్చింది.

Show comments