NTV Telugu Site icon

Tollywood: కొండా సురేఖ వ్యాఖ్యలపై Jr.NTR, NANI ఘాటు రియాక్షన్..!

Ntr Nani

Ntr Nani

అక్కినేని నాగార్జునకుటుంబంపై అలాగే అక్కినేని నాగచైతన్య, సమంత విడాకుల గురించి తెలంగాణా మంత్రి కొండా సురేఖ మాట్లాడిన మాటలు సమాజం తల దించుకునేలా ఉన్నాయి. రాజకీయ నాయకులు తమ తమ అధికారాలను ప్రజా సేవకు ఉపయోగించుకోవాలి గాని ఇతరుల వ్యక్తిగత జీవితాలపై దిగజారి మాట్లాడడానికి కాదని సదరు మంత్రి గారికి చురకలు అంటించారు. కాగా కొండాసురేఖ వ్యాఖ్యలపై జూనియర్ ఎన్టీయార్ కాస్త ఘాటుగా సమాధానం చెప్పాడు.

Also Read : Amala Akkineni : మీ నేతలను అదుపులో ఉంచుకోండి రాహుల్ గాంధీ: అమల

జూనియర్ ఎన్టీయార్ వ్యక్తిగత ‘X’ ఖాతాలో ‘కొండా సురేఖ గారు ఇతరుల వ్యక్తిగత జీవితాలను బయటకులాగడం, వారి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ఠ. ప్రజా జీవితంలో ఉన్న మీలాంటి ముఖ్యమైన వ్యక్తులు కాస్త హుందాగా మరియు గౌరవంగా, గోప్యతను పాటించేలా వ్యవహరించాలి. బాధ్యతారాహిత్యంగా చిత్ర పరిశ్రమపై నిరాధార వ్యాఖ్యలు చేయడం నిజంగా బాధాకరం. గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాలి అంటే గాని ఇలా హద్దులు దాటి దిగజారి మాట్లాడకూడదు. ఈ అహంకార ప్రవర్తనను సభ్య సమాజం ఎట్టి పరిస్థితుల్లోనూ హర్షించదు, ఇకనుండి ఇతరులు ఎవరైన మాపై ఇలాంటి ఆరోపణలు చేస్తే చూస్తూ కూర్చొనేది లేదు. సైలెంట్‌గా ఉండం” అని వార్నింగ్ ఇచ్చాడు తారక్ .

నేచురల్ స్టార్ నాని ‘‘ రాజకీయ నాయకులు తమఇష్టానుసారం ఇతరులపై అర్థంపర్థంలేని వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే అసహ్యం వేస్తోంది. కనీస బాధ్యత లేకుండా ఇతరుల వ్యక్తిగత జీవితాలపై మీరు మాట్లాడుతున్న తీరు చూస్తే, మీకు అసలు బాధ్యత ఉందా అనిపిస్తోంది. ఇది కేవలం సినిమా నటులు, ఇండస్ట్రీ, రాజకీయ పార్టీకి సంబంధించిన అంశం మాత్రమే కాదు. మంత్రి హోదాలో ఉండి ఇలాంటి నిరాధార ఆరోపణలు చేయడం ఏమాత్రం సబబు కాదు. సమాజం తలదించుకునే ఇలాంటి చర్యలను ప్రతి ఒక్కరు ఖండించాలి’’ అని పోస్ట్ చేసాడు.

 

Show comments