Tollywood February Box Office Report : ఫిబ్రవరిలో పరాజయాల పరంపర.. ఆదుకోని శ్రీ విష్ణు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫిబ్రవరి మొదటి వారంలో చిన్న సినిమాలు వరుసగా థియేటర్లలోకి వచ్చాయి. ప్రచారం భారీ ఎత్తున నిర్వహించిన కూడా ప్రేక్షకులను అలరించడంలో విఫలమయ్యాయి.. దాదాపు ఇరవై సినిమాలు రిలీజ్ కాగా ఏ సినిమా ఎలాంటి ఫలితాలను అందుకుందో చుద్ద్దాం..
యుఫోరియా : గుణశేఖర్ దర్శకత్వంలో స్వీయ నిర్మాణంలో తెరకెక్కించిన ఈ యూత్‌ఫుల్ సినిమా ప్రచారం ఎంత చేసినా, ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ మెగా ఫోన్ పట్టుకున్న గుణశేఖర్‌కు ఆశించిన ఫలితం దక్కలేదు.
Also Read
- Bethlehem Kudumba Unit : 'బెత్లెహం కుడుంబ యూనిట్' తెలుగు విడుదలకు అడ్డంకి
- Kamal : సిద్ధా' డైరెక్టర్‌తో కమల్ హాసన్ పవర్ ప్యాక్డ్ ప్రాజెక్ట్..
- Chadalawada : పదవులు కావాల్సింది సీఎంల పక్కన ఫోటోలకా?
- Yash Toxic: రేపు యశ్ ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్! ‘టాక్సిక్’కు మళ్లీ థియేట్రికల్ ట్రీట్.. కానీ ఈసారి స్పెషల్ వెర్షన్
అదే వారంలో విడుదలైన విత్ లవ్, ఆపరేషన్ పద్మ, బరాబర్ ప్రేమిస్తా, బ్లడ్ రోజెస్, లగ్గం, ఎర్రచీర వంటి సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద మొదటి రోజే డిజాస్టర్‌గా నిలిచాయి.
ఫంకీ : విశ్వక్ సేన్ నటించిన ఈ సినిమా ఫలితం ఫ్లాప్‌గానే మారింది. కామెడీ ఏ మాత్రం మెప్పించకపోవడంతో డిజాస్టర్ గా నిలిచి విశ్వక్ ఖాతాలో మరోక ప్లాప్ ఇచ్చింది.
కపుల్ ఫ్రెండ్లీ : సంతోష్ శోభన్ హీరోగా నటించన ఈ చిత్రం ఊహించిన దానికంటే మెరుగైన వసూళ్లు సాధించి కొంత ఊరటనిచ్చింది. లాంగ్ గ్యాప్ తర్వాత సంతోష్ కు హిట్ దక్కింది. ప్రభాస్ ప్రచారం ఈ సినిమాకు ఉపయోగపడింది.
సీతాపయనం : సీనియర్ నటుడు అర్జున్ తన కూతుర్ని హీరోయిన్‌గా పరిచయం చేస్తూ తీసిన సీతాపయనం కూడా ప్రేక్షకాదరణ పొందలేదు. సీరియల్ లాగా ఉందనే కామెంట్స్ వినిపించాయి.
అదే రోజు వచ్చిన అమరావతికి ఆహ్వానం, స్కై, నిలవే వంటి సినిమాలు కూడా ఫ్లాప్ జాబితాలో చేరాయి. సుహాస్ హే బలవంత్, శివ కందుకూరి నవాబ్ కేఫ్ సినిమాలు ఇలా వచ్చి అలా వెళ్లాయి.
విష్ణువిన్యాసం : శ్రీవిష్ణు అంటే మినిమం గ్యారెంటీ హీరో. ఎలాంటి కథతో వచ్చిన మినిమం ఓపెనింగ్ ఉంటుంది. కానీ ఈ సినిమా కనీస ఓపెనింగ్స్ కూడా రాబట్టలేకపోయింది. మొదటి వారం ముగిసేలోపే ఫ్లాప్‌గా తేలిపోయింది. బయ్యర్స్ కు నష్టాలు తెచ్చిపెట్టింది.
మొత్తంగా చూసుకుంటే ఫిబ్రవరి నెలలో దాదాపు 20 సినిమాలు విడుదలైనప్పటికీ ఒక్క సినిమా కూడా హిట్ కాలేదు. చిన్న సినిమాలకు థియేటర్ సమస్యలు, సరైన ప్రమోషన్ లేకపోవడం, కంటెంట్ బలహీనత వంటి అంశాలు ప్రతికూలంగా మారాయి. ఇలా ఫిబ్రవరి టాలీవుడ్‌కు నిరాశాజనకమైన నెలగా మిగిలింది.
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!