NTV Telugu Site icon

Tollywood : ముంబై భామ కోసం ముప్పై వేలు అదనపు ఖర్చు..

Untitled Design (8)

Untitled Design (8)

అనగనగా ఓ యంగ్ హీరో హిట్టు కొట్టి దాదాపు 5 ఏళ్ళు. సినిమాలు అయితే చేస్తున్నాడు కాని హిట్టు మాత్రం రాలట్లేదు. సొంత ప్రోడక్షన్ లో చేసిన సినిమా భారీ నష్టాలను మిగిల్చింది. హిట్టుకొట్టాలనే కసితో సినిమాలు చేస్తునే ఇటీవల వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాడు ఈ యంగ్ హీరో. తాజాగా రెండు సినిమాలు దర్శకత్వ అనుభవం కలిగిన దర్శకుడి డైరక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

Also Read : Ravi Basrur : ఎన్టీఆర్ పై అభిమానం చాటుకున్న మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్‌

ఈ సినిమాను ఇద్దరి నిర్మాతలు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ నిర్మాతలకు వింత అనుభవం ఎదురైంది. ఈ చిత్రంలో ముంబైకి చెందిన ఓ భామను తీసుకున్నారు. షూటింగ్ మెుదటి రోజు ముగిసాక నిర్మాతకు ఓ వింత కండిషన్ పెట్టిందట. అదేమంటే ఈ భామ బస చేసే హోటల్ గదిలో పడుకునే బెడ్ ఆమె హైట్ కంటే కొంత తక్కువ పొడవు ఉందట, నిర్మాతలను పిలిచి కొంచం పోడవు బెడ్ కావాలని కోరగా అదే హోటల్ లో పొడవు బెడ్ ఉన్న రూమ్ ఆమెకు కేటాయించారు. అక్కడ ఆమె కంటే బెడ్ పోడవు ఎక్కువ ఉందట. దాంతో మళ్ళి నిర్మాతలను పిలిచి కరెక్ట్ గా నా హైట్ కు సరిపడా బెడ్ తయూరు చేసి తీసుకురమ్మని చెప్పుందట, లేదంటే వెళ్ళిపోతానని చెప్పేసిందట. అసలే ఫైవ్ స్టార్ హోటల్, అక్కడ బయటి వస్తువుసు అనుమతి లేదు. దీంతో నిర్మాతలు హోటల్ మేనేజర్స్ ను బ్రతిమిలాడి ఆమె సైజ్ కు తగ్గట్టుగా ముప్పే వేలు ఖర్చుతో కొత్త బెడ్ తయారు చేపించి ఇచ్చారట.  కోరి తెచుకున్నప్పుడు కావాల్సినవి ఇవ్వాలి కదా మరి.

Show comments